రాధేశ్యామ్ పై అనుమానాలు.. టీజర్ తరువాతే బిజినెస్.. లేకపోతే..?
రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను ఎనౌన్స్ చేసి అభిమానులకు మంచి కిక్కు ఇచ్చాడు. ఆ సినిమాలు థియేటర్స్ లోకి ఎప్పుడు వస్తాయో గాని అంచనాలు మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక రాధేశ్యామ్ సినిమాను జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

స్పీడ్ పెంచిన ప్రభాస్
ప్రభాస్ ఇప్పటికే సలార్ సినిమాను సెట్స్ పైకి తెచ్చిన విషయం తెలిసిందే. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాను దాదాపు 200కోట్ల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. 2022 సంక్రాంతికి సలార్ ప్రేక్షకుల ముందుకు రావచ్చని టాక్ వస్తోంది. ఇక ఆ సినిమాతో పాటు ఆదిపురుష్ సినిమాను కూడా సెట్స్ పైకి తెచ్చారు. కానీ మొదటిరోజే ఫైర్ యాక్సిడెంట్ కావడం వలన షెడ్యూల్ లో మార్పులు జరిగాయి.

ఆ హడావుడి కనిపించడం లేదు
ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాధేశ్యామ్ బిజినెస్ డీలింగ్స్ ఇంకా పూర్తి స్థాయిలో క్లోజ్ అవ్వలేదని తెలుస్తోంది. చాలా వరకు ప్రభాస్ సినిమాలకు సినిమా షూటింగ్ మొదలైనప్పుడే బయ్యర్లు ఏరియాల హక్కులను కొనడానికి పోటీ పడుతుంటారు. కానీ ఈ సినిమాకు ఆ హడావుడి కనిపించడం లేదని రూమర్స్ వస్తున్నాయి.

సాహో దెబ్బ..
బాహుబలి సినిమాతో బాక్సాఫీస్ తన రేంజ్ ను ఎంతగానో పెంచుకున్న ప్రభాస్ సాహోతో మాత్రం ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. ఆ సినిమా విడుదలకు ముందు ఏ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాహుబలి తరువాత అత్యదిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నిర్మాతలకు పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చింది కానీ చాలా వరకు డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోవాల్సి వచ్చింది.

అలా అయితే.. కష్టమంతా వృధా..
ఇక ఆ ఎఫెక్ట్ ఇప్పుడు రాధేశ్యామ్ పై ఎంతో కొంత పడేలా చేసిందనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాహో కంటే హై రేంజ్ లో సినిమా బిజినెస్ చేయవచ్చని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు పెట్టిన పెట్టుబడికి సమానంగా బిజినెస్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రేంజ్ లో వస్తే నిర్మాతల కష్టం వృదా అయినట్లే.

టీజర్ తరువాతే బిజినెస్
ఇక ఇప్పుడు అందరి చూపు టీజర్ పైనే ఉంది. ఆ సినిమాతో సినిమాపై అంచనాల డోస్ ను మరింత పెంచాలని అనుకుంటున్నారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా టీజర్ ను విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక టీజర్ అనంతరం యూవీ క్రియేషన్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ పై చర్చలు జరిపే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి టీజర్ ఏ స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











