దటీజ్ రాధిక ఆప్టే... 4 రోజుల్లో వంద కోట్లు... చైనాలో బ్యూటీ మూవీకి బ్రహ్మరథం
Recommended Video

దేశంలో ప్రతిభావంతులైన యువ తారల్లో రాధిక ఆప్టే ఒకరనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆమె పలు భాషల్లో విభిన్నమైన పాత్రలతో విశేషంగా పేరు సంపాదించుకొన్నారు. బాలీవుడ్ గతేడాది ఆమె నటించిన అంధాదున్ చిత్రానికి మంచి ప్రశంసలు లభించాయి. ఆ చిత్రాన్ని చైనాలో కూడా రిలీజ్ చేయగా రికార్డు కలెక్షన్లను వసూలు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. వివరాల్లోకి వెళితే

చైనాలో రాధికా ఆప్లే మూవీకి ప్రశంసలు
ఇప్పటి వరకు దేశీయంగానే సత్తా చాటిన రాధిక ఆప్టే, ప్రస్తుతం చైనాలో కూడా రికార్డు వసూళ్లతో మోత మోగిస్తున్నది. అంధాదూన్ చిత్రంలోని ఆమె నటనకు చైనా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ చిత్రంలో ఆమె నటనపై చైనా సినీ విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఆమె ప్రతిభ ఎల్లలు దాటి కొత్త రికార్డులు సృష్టిస్తున్నది.

100 కోట్ల క్లబ్‌లో
బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన అంధాదూన్ చిత్రం ఇటీవలే చైనాలో విడుదలైంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ.100 కోట్లు దాటేసింది. విడుదలైన మొదటి షో నుంచే ఈ చిత్రానికి చైనాలో ప్రేక్షకులు బ్రహ్మరథ పడుతున్నారు. రానున్న రోజుల్లో రికార్డు స్థాయి వసూళ్లు చేపట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మంచి పాత్రల కోసమే జీవితం
విజయాల పరంపర కొనసాగిస్తున్న రాధిక ఆప్టే ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. నిజాయితీగా చెప్పాలంటే నేను ఇంకా మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నాను. మంచి, పాజిటివ్ పాత్రలు ఇంత వరకు నా వద్దకు రాలేదు. వాటి కోసం ఇంకా వేచి చూస్తున్నాను. నా మనసుకు నచ్చిన పాత్రల్లో నటించాలని ఎదురుచూస్తున్నాను అని రాధిక ఆప్టే అన్నారు.

వెతుక్కొంటూ వెళ్తున్నా
మంచి పాత్రల కోసం నేను చాలా మందిని అడుగుతుంటాను. కొన్ని పాత్రలు నా వద్దకు వాటంతంటా అవే వస్తాయి. మరికొన్నింటికి కోసం వెతుక్కొంటూ వెళ్తాను. మంచి ప్రాజెక్ట్ ఉందని తెలిస్తే నేను వెతుక్కుంటూ వెళ్తాను. వారికి ఫోన్ చేసి అడుగుతాను అని రాధిక ఆప్టే తెలిపారు.


Click it and Unblock the Notifications











