twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కలెక్షన్లతో హోరెత్తిస్తున్న కాంచన 3... లారెన్స్ రాఘవ కెరీర్‌లోనే..

    |

    Recommended Video

    Kanchana 3 Movie Three Days Box Office Collections Report || Filmibeat Telugu

    మాస్ హీరో లారెన్స్ రాఘవ స్వీయ దర్శకత్వం, నిర్మాణ సారథ్యంలో రూపొందిన చిత్రం కాంచన 3. లారెన్స్ రూపొందించిన ముని సినిమాకు మూడో సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో లారెన్స్ సరసన వేదిక, ఓవియా కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట మాస్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో ఈ చిత్రం రికార్డు కలెక్షన్లను రాబడుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో కాంచన 3 సినిమా కలెక్షన్లు ఇలా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..

     నైజాం, సీడెడ్‌ ఏరియాలో

    నైజాం, సీడెడ్‌ ఏరియాలో

    కాంచన 3 చిత్రం నైజంలో మంచి వసూళ్లను రాబడుతున్నది. జెర్సీ చిత్రం నుంచి మంచి పోటీ ఎదుర్కొని క్రేజీ నంబర్లను నమోదు చేసింది. కాంచన 3 చిత్రం నైజాంలో గత మూడు రోజుల్లో రూ.3 కోట్ల 5 లక్షలను రాబట్టింది. ఇక సీడెడ్‌లో ఈ చిత్రం రికార్డు స్థాయిలో రూ.2.05 కోట్లు వసూలు చేసింది.

    ఆంధ్రాలో వసూళ్లు

    ఆంధ్రాలో వసూళ్లు

    ఆంధ్రలో కూడా కాంచన 3 చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ సినిమా కృష్ణా జిల్లాలో రూ.69.23 లక్షలు, వైజాగ్‌లో రూ.96.04 లక్షలు, నెల్లూరులో రూ.32.06 లక్షలు, గుంటూరులో 85 లక్షలు, పశ్చి గోదావరి జిల్లాలో రూ.51 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.75 లక్షలు వసూలు చేసింది.

    తెలుగు, తమిళ రాష్ట్రాల్లో కలెక్షన్లు

    తెలుగు, తమిళ రాష్ట్రాల్లో కలెక్షన్లు

    ప్రపంచవ్యాప్తంగా కాంచన 3 చిత్రం 2600 స్క్రీన్లలో రిలీజైంది. గత మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.15.20 కోట్ల గ్రాస్ 9.13 కోట్ల రూపాయల నికర వసూళ్లను రాబట్టింది. తమిళనాడులో గత మూడు రోజుల్లో రూ.30 కోట్ల రూపాయాల గ్రాస్‌ను వసూలు చేసింది.

    ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు

    ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు

    ఓవర్సీస్ కలెక్షన్లలో యూఏఈలో ఈ చిత్రం 31 లక్షల రూపాయలను వసూలు చేసి మొత్తంగా ఈ చిత్రం రూ.60 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కలెక్షన్లలో ఈ చిత్రం పేటా, విశ్వాసం చిత్రాల తర్వాత నిలవడం గమనార్హం. హారర్, కామెడీగా రూపొందించిన చిత్రం మాస్, క్లాస్ అనే తేడా లేకుండా భారీ వసూళ్లను రాబట్టడం ట్రేడ్ వర్గాలను, సినీ క్రిటిక్స్‌ను ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

    English summary
    Raghava Lawrence's latest is Kanchana 3. This movie's pre release function held in hyderabad. In this functions, Megastar Chiranjeevi appreciated Lawrence. Chiranjeevi shared his feelings in a video.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X