100 కోట్లు కొల్లగొట్టిన కాంచన.. లారెన్స్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్
Recommended Video
ప్రముఖ కోరియో గ్రాఫర్ లారెన్స్ రాఘవ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించి నటించిన కాంచన 3 చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నది. తొలివారంలోనే ఈ చిత్రం కాసుల పంట పడించడం ట్రేడ్ వర్గాలను, సినీ విమర్శకులను షాక్ గురిచేస్తుంది. దక్షిణాదిలోని సినీ విమర్శకుల అంచనాలను తలదన్నీ ఈ సినిమా వసూళ్లను రాబట్టడం సినీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో భారీ వసూలు రాబట్టి వంద కోట్లు కలెక్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే...

బీ, సీ సెంటర్లలో కలెక్షన్ల హవా
హారర్, కామెడీ అంశాలను మేళవించి కాంచన 3 చిత్రాన్ని లారెన్స్ రాఘవ రూపొందించారు. ముని, కాంచన, తర్వాత అదే సీక్సెల్‌లో కాంచన 3 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేం ఓవియా, వేదిక, నిక్కి తంబోలి, కోవై సరళ, శ్రీమాన్ తదితరులు నటించారు. విడుదలైన ప్రతీ చోట కాంచన 3 చిత్రం వసూళ్ల ధమాకాను సృష్టిస్తున్నది. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో కలెక్షన్లు భారీగా ఉండటంతో సినిమా సక్సెస్ దారిని పట్టింది.

తొలివారంలోనే రూ.100 కోట్లు
ప్రముఖ ట్రేడ్ అనలిస్టు రమేష్ బాలా స్పందిస్తూ.. కంచన 2 చిత్రం తమిళ, తెలుగులో భారీ వసూళ్లను సాధిస్తున్నది. తొలివారంలోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.100 కోట్లు మార్కును దాటేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మాస్ హిట్‌గా నిలిచింది అని ట్వీట్ చేశారు. నికరంగా ఈ చిత్రం రూ.75 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్టు నిర్మాతలు ప్రకటించారు.

ప్రపంచవ్యాప్తంగా 2వేలకు పైగా స్క్రీన్లలో
కాంచన 3 చిత్రం దేశవ్యాప్తంగా రికార్డు స్క్రీన్లలో రిలీజైంది. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో కలిపి దాదాపు 1500 స్కీన్లలో పలు రాష్ట్రాల్లో విడుదలైంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 2600 స్క్రీన్లలో ఏప్రిల్ 19న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వెళ్లింది.

సంతోషంలో హీరోయిన్ వేదిక
కాంచన ఘనవిజయం వైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో హీరోయిన్ వేదిక సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాంచన 3 షూట్ ఓ హాలీడేలా సాగిపోయింది. ఈ విజయం నా కెరీర్‌కు చాలా ఉపయోగపడుతుంది. మళ్లీ కాంచన తర్వాత కాంచన సీక్వెల్‌లో నటించడం చాలా హ్యాపీగా ఉంది అని అన్నారు.

హిందీలో కాంచన రీమేక్
ఇదిలా ఉండగా, కాంచన సినిమా హిందీలో రీమేక్ అవుతున్నది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. కాంచన టైటిల్ రోల్‌ను పోషించిన శరత్ కుమార్ పాత్రను సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ పోషిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పాటతో షూటింగ్ ప్రారంభమైంది.


Click it and Unblock the Notifications











