Raid 2 Box Office: రైడ్ 2 మూవీకి రికార్డు ఓపెనింగ్స్.. అజయ్ దేవగన్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టీ సిరీస్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్స్ భూషణ్ కుమార్, కిషన్ కుమార్, కుమార్ మంగత్ పాథక్, అభిషేక్ పాథక్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం రైడ్ 2 (Raid 2). 2018 సంవత్సరంలో సూపర్ హిట్ అయిన రైడ్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, రితేష్ దేశ్‌ముఖ్, వాణి కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఏ రేంజ్‌లో బిజినెస్ జరిగింది? ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
హిందీ సినిమా పరిశ్రమలో 2018 సంవత్సరంలో ఊహించని విజయం సాధించిన రైడ్ సినిమాకు సీక్వెల్ వస్తుందని అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో ఈ సినిమాను టాప్ యాక్టర్లు, టాలెంటెడ్ టెక్నిషియన్స్‌తో నిర్మించడంతోపాటు భారీగా ప్రమోషన్స్ చేశారు. దాంతో ఈ సినిమా నిర్మాణ వ్యయం సుమారుగా 100 కోట్లు కాగా, ప్రమోషనల్ ఖర్చులు 20 కోట్లు కలిపి మొత్తంగా 120 కోట్ల రూపాయల బడ్జెట్‌గా ఈ ప్రాజెక్టును వాల్యూ కట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

రైడ్ 2 సినిమా ప్రమోషనల్ కంటెంట్, టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఆడియెన్స్ నుంచి అధికంగా డిమాండ్ కనిపించింది. దాంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 5000 స్క్రీనల్లో రిలీజ్ చేసింది. ఈ సినిమాను టీ సిరీస్ స్వయంగా విడుదల చేసింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాదాపు 70 కోట్ల షేర్, 140 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అజయ్ దేవగన్ నటించిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీ నమోదైంది. ముంబైలో 53 శాతం, పూణే 54 శాతం, బెంగళూరు 58 శాతం, చెన్నైలో 64 శాతం, హైదరాబాద్‌లో 35 శాతం, కోల్‌కతాలో 35 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. ఇక ఇతర నగరాల్లో 30 శాతం కంటే తక్కువగా ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక ఈ సినిమా తొలి ఆట తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో ఆక్యుపెన్సీ వేగంగా పుంజుకొన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
రైడ్ 2 సినిమాకు ఏకపక్షంగా హిట్ టాక్ రావడంతో నార్త్ ఇండియాలో ప్రేక్షకుల సానుకూలంగా స్పందించారు. దాంతో తొలి రోజు ఈ సినిమా ఇండియాలో సుమారుగా 17 కోట్లకుపైగానే వసూళ్లను రాబడుతుంది. ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఓవర్సీస్‌లో ఈ సినిమా 5 కోట్ల మేర వసూళ్లు సాధించవచ్చు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా తొలి రోజు 20 నుంచి 22 కోట్ల మధ్య కలెక్షన్లు నమోదు చేయవచ్చు అని సాక్ నిల్క్, ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అజయ్ దేవగన్ నటించిన రైడ్ సినిమా తొలి రోజు సుమారుగా 16 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమాను మించి ప్రస్తుతం రైడ్ 2 కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ ఏడాది భారీ వసూళ్లు రాబట్టిన ఛావా, సికందర్ సినిమా తర్వాత రైడ్ మూవీ ఆ జాబితాలో చేరే అవకాశం ఉంది. ఇదే ఊపు కొనసాగితే.. ఈ సినిమా వీకెండ్‌లో 100 కోట్లకు చేరువయ్యే ఛాన్స్ కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











