100 Crores Raid 2: 100 కోట్లతో రైడ్ 2 బాక్సాఫీస్ జైత్రయాత్ర.. అజయ్ దేవగన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్‌గా
బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టీ సిరీస్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్స్ భూషణ్ కుమార్, కిషన్ కుమార్, కుమార్ మంగత్ పాథక్, అభిషేక్ పాథక్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం రైడ్ 2 (Raid 2). 2018 సంవత్సరంలో సూపర్ హిట్ అయిన రైడ్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, రితేష్ దేశ్‌ముఖ్, వాణి కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఏ రేంజ్‌లో బిజినెస్ జరిగింది? ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
హిందీ సినిమా పరిశ్రమలో 2018 సంవత్సరంలో ఊహించని విజయం సాధించిన రైడ్ సినిమాకు సీక్వెల్ వస్తుందని అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో ఈ సినిమాను టాప్ యాక్టర్లు, టాలెంటెడ్ టెక్నిషియన్స్‌తో నిర్మించడంతోపాటు భారీగా ప్రమోషన్స్ చేశారు. దాంతో ఈ సినిమా నిర్మాణ వ్యయం సుమారుగా 100 కోట్లు కాగా, ప్రమోషనల్ ఖర్చులు 20 కోట్లు కలిపి మొత్తంగా 120 కోట్ల రూపాయల బడ్జెట్‌గా ఈ ప్రాజెక్టును వాల్యూ కట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

రైడ్ 2 సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. గత కొద్దికాలంగా వరుస డిజాస్టర్లతో బెంబేలెత్తిన బాలీవుడ్‌కు ఈ సినిమా కొంత ఉపశమనం కలిగించింది. మంచి కంటెంట్ ఉంటే ఫ్రాంచైజీలను ప్రేక్షకుల ఆదరిస్తారనే విషయాన్ని రైడ్ 2 మరోసారి నిరూపించింది. ఈ సినిమా ఏకంగా 100 కోట్ల క్లబ్‌లో చేరడం ట్రేడ్ వర్గాల్లో జోష్ నింపింది.
రైడ్ 2 సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా మొదటి రోజు 20 కోట్ల రూపాయలు, రెండో రోజు 13 కోట్ల రూపాయలు, మూడో రోజు 19 కోట్ల రూపాయలు, 4వ రోజు 22.5 కోట్ల రూపాయలు, 5వ రోజు 7.5 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 80 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అజయ్ దేవగన్ కెరీర్‌లో భారీగా వసూలు చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
రైడ్ 2 సినిమాకు ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా భారీగా రెస్సాన్స్ లభించింది. ఈ సినిమా మెరుగైన కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో సుమారుగా 2 మిలియన్ల అమెరికన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 22 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 102 కోట్ల రూపాయలు రాబట్టింది.
ఇదిలా ఉండగా, ఈ సినిమా 6వ రోజు కూడా నిలకడగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమాకు సుమారుగా 35 శాతం ఆక్యుపెన్సీ నమోదు అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మూవీ తాజా అంచనాల ప్రకారం 5 కోట్ల రూపాయలు రాబడుతుందని బాలీవుడ్ ట్రేడ్ ఎక్స్‌పర్ట్ భావిస్తున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 80 కోట్ల రూపాయలు నెట్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటుతుందా? లేదా వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











