Raja Raja Chora day 1 collections: బెల్ బాటమ్, క్రేజీ అంకుల్స్ బాక్సాఫీస్ హిట్టా? ఫట్టా?

సెకండ్ వేవ్ లాక్‌డౌన్ తర్వాత పలు సినిమాల రిలీజ్‌ దేశవ్యాప్తంగా కనిపించాయి. తెలుగులో రాజ రాజ చోర, కనబడుటలేదు, క్రేజీ అంకుల్స్, హిందీలో బెల్ బాటమ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే లాక్‌డౌన్ తర్వాత థియేటర్లలో పరిస్థితి సానుకూలంగా లేకపోవడం వల్ల అక్యుపెన్సీ రేటు తక్కువగానే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తొలి రోజు ఈ సినిమాలపై ఎలాంటి అంచనాలు ఉన్నాయంటే..

అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటమ్ చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ అయింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1800 స్క్రీన్లలో రిలీజ్ అయింది. కోవిడ్ తర్వాత అత్యధికంగా స్క్రీన్లలో రిలీజ్ అయిన చిత్రంగా రికార్డు అందుకొన్నది. వాస్తవానికి కోవిడ్‌కు ముందు సుమారు 4 వేల థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశం ఉండేది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అక్యుపెన్సీ 50 శాతం కంటే తక్కువగా ఉండగా, దేశవ్యాప్తంగా 50 శాతానికి అటు ఇటుగా ఉందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

Raja Raja Chora, Bell Bottom, Crazy Uncles, Kanabadutaledu Day 1 Expected Box Office Collections

దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ పరిస్థితులు ఉండటం అలాగే.. అడ్వాన్స్ ఓపెనింగ్స్‌ కూడా పెద్దగా లేకపోవడంతో ట్రేడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు అడ్వాన్స్ బుకింగ్.. 35 శాతానికి తక్కువగానే ఉందనే విషయాన్ని వెల్లడించారు.

ఇదిలా ఉండగా, థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రాన్ని త్వరగా ఓటీటీలో రిలీజ్ చేస్తే భారీ ఆఫర్‌ను ఇవ్వడానికి అమెజాన్ ప్రైమ్ వీడియో సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. నెల రోజుల లోపే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే. రూ.30 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు భారీ డీల్‌ను నిర్మాతల ముందు పెట్టినట్టు తెలిసింది.

రాజ రాజ చోర సినిమా విషయానికి వస్తే.. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా బిజినెస్ సుమారు రూ.5 కోట్ల మేరకు జరిగిందని, ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు 5.25 కోట్లు రాబట్టాల్సిన అవసరం ఉందనే వెల్లడిస్తున్నారు.
అయితే హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న రాజ రాజ చోర పరిస్థితి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ రెస్సాన్స్ ఉన్నట్టు సమాచారం. చాలా చోట్ల పెద్దగా అక్యుపెన్సీ నమోదు కాలేదనే విషయం స్పష్టమవుతున్నది. ఈ చిత్రం తొలి రోజున 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇక చిన్న చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రేజీ అంకుల్ పరిస్తితి కూడా అదే విధంగా ఉందని, థియేటర్లలో ప్రేక్షకుల పలచగా కనిపించారనే విషయాన్ని ట్రేడ్ రిపోర్టులు, వర్గాలు వెల్లడిస్తున్నాయి. కనబడుటలేదు థియేటర్ల వద్ద అక్యుపెన్సీ రేటు తక్కువగానే ఉన్నట్టు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా రాజ రాజ చోర, క్రేజీ అంకుల్స్, కనబడుటలేదు సినిమాలు త్వరలోనే ఓటీటీలోకి వస్తున్నట్టు అప్పుడే ప్రచారం జరుగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X