twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Raja Raja Chora Closing Collections: శ్రీ విష్ణు మూవీ హిట్టా? ఫట్టా? అంటే..

    |

    టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటించిన రాజ రాజ చోర సినిమా రిలీజై మూడు వారాంతాన్న్ి పూర్తి చేసుకోబోతున్నది. సానుకూలమైన టాక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను మూటగట్టుకొన్నది. కానీ ఈ సినిమా వారాంతం తర్వాత బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురైంది. అయితే ఈ సినిమా కలెక్షన్లు ప్రీ రిలీజ్‌ బిజినెస్ సెట్ చేసిన టార్గెట్‌ను అందుకొన్నదా? ఎలాంటి ప్రాఫిట్స్‌ను ఈ సినిమా నమోదు చేసిందనే విషయాల్లోకి వెళితే..

    శ్రీ విష్ణు కెరీర్‌లోనే...

    శ్రీ విష్ణు కెరీర్‌లోనే...

    రాజ రాజ చోర చిత్రం ప్రస్తుతానికి బాక్సాఫీస్ వద్ద 18 రోజుల ప్రయాణాన్ని కొనసాగించింది. గత మూడు వారాంతాల్లో నైజాం, ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లో ఎక్కువ షేర్ సాధించింది. ఇటీవల రిలీజైన చిత్రాల్లో భారీగా లాభాలను సాధించిన చిత్రంగా, అలాగే శ్రీ విష్ణు కెరీర్‌లో అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రంగా రాజ రాజ చోర ఓ ప్రత్యేకతను సొంతం చేసుకొన్నది.

    18 రోజుల కలెక్షన్లు ఇలా..

    18 రోజుల కలెక్షన్లు ఇలా..

    రాజ రాజ చోర గత 18 రోజులు కలెక్షన్లను పరిశీలిస్తే.. నైజాంలో ఈ చిత్రం భారీ కలెక్షన్లను నమోదు చేసింది. నైజాంలో ఈ చిత్రం రూ.2.14 కోట్లు వసూలు చేసింది. అలాగే సీడెడ్‌లో ఈ చిత్రం 79 లక్షల షేర్‌ను రాబట్టింది. రెండో లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్‌లో అత్యధికంగా కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది.

    ఆంధ్రాలో ఘనంగానే...

    ఆంధ్రాలో ఘనంగానే...

    ఇక ఆంధ్రా ప్రాంతంలోని పలు జిల్లాల కలెక్షన్లను పరిశీలిస్తే.. ఉత్తరాంధ్రలో 69 లక్షల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 41 లక్షల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 24 లక్షల రూపాయలు, గుంటూరులో 45 లక్షలు, కృష్ణా జిల్లాలో 26 లక్షల రూపాయలు, నెల్లూరు జిల్లాలో 18 లక్షల రూపాయలు వసూలు చేసింది.

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఎంతంటే..

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఎంతంటే..

    ఇదిలా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, ఇతర స్ట్రేట్స్‌లో కలెక్షన్లు ఓ మోస్తారుగా కనిపించాయి. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 16 లక్షల రూపాయలను రాబట్టింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్‌లో 72 లక్షలు వసూలు చేసింది.

    దాంతో ఏపీలో 5.16 కోట్ల నికర వసూళ్లు, 8.80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రాజ రాజ చోర ప్రపంచవ్యాప్తంగా రూ.6.04 కోట్లు నికరం కలెక్షన్లు, 10.80 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొన్నది.

    Recommended Video

    Gem Movie Team Special Interview With Racha Ravi
    ఏ రేంజ్ లాభాలు అంటే..

    ఏ రేంజ్ లాభాలు అంటే..

    రాజ రాజ చోర చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ చిత్రం 2.20 కోట్ల మేరకు జరిగింది. ఈ చిత్రం 2.4 కోట్ల కలెక్షన్ల టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం రూ.6.04 కోట్లు సాధించడంతో భారీగా లాభాలను నమోదు చేసింది. దాదాపు ఈ చిత్రం రూ.3.64 కోట్ల లాభాన్ని సాధించి.. శ్రీ విష్ణు మార్కెట్‌ గ్రాఫ్‌ను పెంచింది.

    English summary
    Sree Vishnu's Raja Raja Chora almost finishes its box office run. The movie collected Rs.6 crores above world wide. It got over 3 crores profit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X