Raja Raja Chora collections.. టాక్ చూస్తే బ్రహ్మండంగా.. కలెక్షన్లు చూస్తే షాకింగ్‌గా!

టాలీవుడ్‌లో ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకొంటున్న శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం రాజ రాజ చోర సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు తొలి చిత్ర దర్శకుడిగా హసిత్ గోలి పరిచయం అయ్యారు. అయితే రిలీజ్ తర్వాత భారీగా పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకొన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫలితాలను నమోదు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. గత రెండు రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే. ..

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు

రాజ రాజ చోర సినిమాకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు మంచి అంచనాలు పెంచడం, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శ్రీ విష్ణు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ భారతీయ అన్ని భాషల్లో రీమేక్ చేయాల్సిన చిత్రంగా అభివర్ణించడంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే సినిమా చూస్తే శ్రీ విష్ణు ఓవర్‌గా ఫీలయ్యాడనే ఫీలింగ్ కలుగకమానదని సినీ విమర్శకులు, ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

 ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఘనంగానే

ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఘనంగానే

రాజ రాజ చోర సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. కొన్ని చోట్ల సొంతంగా, థర్డ్ పార్టీ వర్గాల ద్వారా రిలీజ్ చేసుకొన్నారనే వార్తల మధ్య ఈ బిజినెస్‌ను సుమారు రూ.5 కోట్లుగా లెక్క కట్టారు. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే సుమారు రూ.5.25 కోట్ల లాభాలను ఆర్జించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

 తొలి రోజు వసూళ్లు నిరాశజనకంగానే

తొలి రోజు వసూళ్లు నిరాశజనకంగానే

రాజ రాజ చోర సినిమా రిలీజ్ తర్వాత ఏకపక్షంగా మంచి రివ్యూలు నమోదయ్యాయి. దాంతో కలెక్షన్లు వరదలా వచ్చిపడుతాయని అనుకొన్న సినీ వర్గాలకు షాకింగ్‌గా వసూళ్లు నమోదయ్యాయి. తొలి రోజున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 1 కోటికి లోపు గ్రాస్, రూ.60 లక్షల మేర షేర్ నమోదైనట్టు సమాచారం. అయితే ఊహించిన దానికంటే తక్కువగానే ఈ కలెక్షన్లు వచ్చాయనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

రెండో రోజు కలెక్షన్లు ఇలా..

రెండో రోజు కలెక్షన్లు ఇలా..

ఇక రెండో రోజు రాజ రాజ చోర చిత్రం బాక్సాఫీస్ వద్ద తడాఖా చూపిస్తుందని ఆశించిన వారికి షాక్ తగిలింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1 కోటి గ్రాస్ కలెక్షన్లు, రూ.80 లక్షల షేర్‌ను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1.4 కోట్ల షేర్‌ను సాధించినట్టు అయింది.

Recommended Video

Raja Raja Chora Movie Trailer | Filmibeat Telugu
లాభాల్లోకి రావాలంటే..

లాభాల్లోకి రావాలంటే..

రాజ రాజ చోర సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరిగణనలోకి తీసుకొంటే... ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. ఇంకా భారీగానే కలెక్షన్లను రాబట్టాల్సి ఉంది. అంటే ఇంకా సుమారు రూ.3.5 కోట్లు రాబట్టగలిగితే బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా లాభాలను సాధిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X