Raja Shivaji Box Office: రాజా శివాజీ బాక్సాఫీస్ కాసుల వర్షం.. మరాఠీ చిత్రానికి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
బాలీవుడ్ స్టార్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం రాజా శివాజీ. మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మించిన చత్రపతి శివాజీ జీవితంలోని కీలక ఘట్టాలను ఆధారంగా తీసుకొని ఈ సినిమాను హీరోయిన్ జెనీలియా దేశ్‌ముఖ్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఈ చిత్రంలో శివాజీగా రితేష్ దేశ్‌ముఖ్ నటించగా, ఇతర పాత్రల్లో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, మహేష్ మంజ్రేకర్, సచిన్ ఖేడ్కర్, విద్యా బాలన్, భాగ్యశ్రీ, ఫర్దీన్ ఖాన్, జెనీలియా దేశ్‌ముఖ్ నటించారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రల్లో మెరిసారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: సంతోష్ శివన్, ఎడిటింగ్: ఊర్వశీ సక్సేనా, మ్యూజిక్: అతుల్ అజయ్ తమ బాధ్యతలను నిర్వర్తించారు. ముంబై ఫిలిం కంపెనీ, జియో స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం మరాఠీ, హిందీ భాషల్లో రిలీజైంది. మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా వసూలు చేస్తున్న కలెక్షన్ల వివరాలు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

భారతీయ చరిత్రలో కీలక భాగంగా నిలిచిన మరాఠా సామ్రాజ్య విస్తరణలో శివాజీ చూపిన ధైర్య సాహసాల నేపథ్యంగా హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో భారీ తారాగణంతోపాటు స్టార్ వాల్యూ ఉన్న నటీనటులు నటించారు. అంతేకాకుండా ఈ సినిమాను అత్యంత భారీ వ్యయంతో క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా నిర్మించారు. ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రమోషనల్ కాస్ట్ అంతా కలిపి సుమారుగా 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.
రాజా శివాజీ సినిమా ప్రోమోలకు మంచి స్పందన రావడం, అలాగే ప్రమోషనల్ కార్యక్రమాలకు అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో రిలీజ్‌కు ముందే ఈ చిత్రం భారీ ఆదరణకు గురైంది. దాంతో ఈ సినిమాను దేశవ్యాప్తంగా 3500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా బజ్ భారీగా ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగా జరిగింది. ఈ చిత్రం 90 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
రాజా శివాజీ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాకు తొలి ఆట తర్వాత హిట్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా భారీగా నమోదు అయ్యాయి. మరాఠా సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లను నమోదు చేస్తున్న చిత్రాల్లో ఒకటిగా ఘనతను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం తొలి రోజు 11.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు 10.55 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం రెండు రోజుల్లో 22 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ సినిమా మరాఠీలో రికార్డు లెవెల్ కలెక్షన్లను నమోదు చేస్తున్నది. తొలి రోజు మరాఠీ వెర్షన్ సుమారుగా 8.5 కోట్ల రూపాయలు రాబట్టింది. రెండో రోజు 7 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది. హిందీలో తొలి రోజు 6.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 3.25 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో సుమారుగా 25 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.
ఇక మూడో రోజు కూడా ఈ చిత్రం భారీగానే వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మూడో రోజు కూడా 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అని తెలిపారు. మరాఠీలో 7 కోట్ల రూపాయలు, హిందీలో3 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ చిత్రం 35 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. ఈ చిత్రం త్వరలోనే 50 కోట్ల రూపాయల క్లబ్ చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications



