twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రాజా ది గ్రేట్’ బాక్సాఫీసు వద్ద పరిస్థితి ఏమిటి?

    రాజా ది గ్రేట్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫలితాలు రాబడుతోంది. తొలి నాలుగు రోజుల్లో కలెక్షన్ బావుంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి నాలుగు రోజుల్లో రూ. 24 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమా

    By Bojja Kumar
    |

    టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ లేటెస్ట్ రిలీజ్ 'రాజా ది గ్రేట్' దీపావళి సందర్భంగా విడుదలైన బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ మంచి వసూళ్లు సాధించింది.

    సినిమా విడుదలైన నాలుగవ రోజు శనివారం కూడా కలెక్షన్స్ సంతృప్తి కరంగా ఉన్నాయని, తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు రూ. 4.5 కోట్ల గ్రాస్ సాధించిందని, ఇందులో రూ. 2.82 కోట్ల షేర్ వచ్చిందని సమాచారం. ఏపీ-తెలంగాణలో మొత్తం నాలుగు రోజుల్లో రూ. 24 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని, ఇందులో రూ. 15.73 డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైనట్లు తెలుస్తోంది.

    నైజాం ఏరియాలో...

    నైజాం ఏరియాలో...

    నైజాం ఏరియాలో రాజా ది గ్రేట్ చిత్రం తొలి 4 రోజుల్లో రూ. 6.55 కోట్లు షేర్ వచ్చిందని, రవితేజ సినిమాలకు నైజాంలో 4 రోజుల్లో ఇంత షేర్ రావడం చాలా గొప్పవిషయమే అని ట్రేడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

    సీడెడ్ ఏరియాలో

    సీడెడ్ ఏరియాలో

    సీడెడ్ ఏరియాలో ‘రాజా ది గ్రేట్' చిత్రం తొలి 4 రోజుల్లో రూ. 2.55 కోట్లు వసూలు చేసింది.

    నెల్లూరులో

    నెల్లూరులో

    నెల్లూరు ఏరియాలో ‘రాజా ది గ్రేట్' చిత్రం రూ. 52 లక్షలు వసూలు చేసింది.

    గుంటూరు ఏరియాలో

    గుంటూరు ఏరియాలో

    గుంటూరు ఏరియాలో రవితేజ నటించిన ఈ చిత్రానికి నాలుగు రోజుల్లో 1.11 కోట్లు వసూలు చేసింది.

    కృష్ణ ఏరియా

    కృష్ణ ఏరియా

    కృష్ణ ఏరియాలో ‘రాజా ది గ్రేట్' చిత్రం నాలుగు రోజుల్లో రూ. 1.02 కోట్లు రాబట్టింది.

    వెస్ట్ గోదావరి

    వెస్ట్ గోదావరి

    వెస్ట్ గోదావరి ఏరియాలో ఈ చిత్రం నాలుగు రోజుల్లో రూ. 91 లక్షలు కలెక్షన్ కురిపించింది.

    తూర్పు గోదావరి జిల్లా

    తూర్పు గోదావరి జిల్లా

    తూర్పు గోదావరి జిల్లాలో రాజా ది గ్రేట్ చిత్రం రూ. 1.17 కోట్లు వసూలు చేసింది.

    ఉత్తరాంధ్ర

    ఉత్తరాంధ్ర

    ఉత్తరాంధ్ర ఏరియాలో ‘రాజా ది గ్రేట్' చిత్రం 4 రోజుల్లో రూ. 1.89 కోట్లు వసూలు చేసింది.

    యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద

    యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద

    యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద రవితేజ నటించిన ఈచిత్రం 4 రోజుల్లో $280K వసూలు చేసింది.

    వరల్డ్ వైడ్

    వరల్డ్ వైడ్

    ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 31 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని, ఇందులో రూ. 20 కోట్లకుపైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చినట్లు సమాచారం.

    English summary
    Tollywood star Ravi Teja’s latest release Raja The Great continues to hold well at the box office in Andhra Pradesh and Telangana. The film, which hit screens on Wednesday, is directed by Anil Ravilpudi. The 4 days total gross stands at over Rs 24 Cr, with a distributor share of 15.73 Cr in the Telugu states.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X