»   » ‘బాహుబలి’ బడ్జెట్ రివిల్ చేసిన రాజమౌళి

‘బాహుబలి’ బడ్జెట్ రివిల్ చేసిన రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాహుబలి' . ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ వేగవంతం అయ్యాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రెండు భాగాలుకు కలిపి... 250 కోట్లు బడ్జెట్ అని రివీల్ చేసారు. అయితే తొలి భాగానికి ఎంతైందనేది మాత్రం తెలియరాలేదు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ వారాంతం కల్లా ఈ సినిమా ఫైనల్ వెర్షన్ ఫస్ట్ కాపీ సిద్దం అవుతుందని ఈ చిత్ర టీం అంటోంది. రాజమౌళి ఒకవైపు ప్రమోషన్స్ లో పాల్గొంటూ, మిగిలిన టైం అంతా ఫైనల్ అవుట్ పుట్ ని ఫైనలైజ్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.


Rajamouli reveals the total budget for Bahubali

ప్రమోషన్స్ పెంచేయటంతో ...దేశవ్యాప్తంగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ‘బాహుబలి' సినిమాకు సంబంధించిన రీ రికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజమౌళి-కీరవాణి రీ రికార్డింగ్ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్నారు.


ఇక ఇప్పటికే ఈ పనులన్నీ దాదాపుగా పూర్తి కావచ్చినట్లు తెలుస్తోంది. విడుదలకు ఇంకా పదిరోజులే ఉండడంతో బాహుబలి టీమ్‌కు ఇది క్లిష్టమైన సమయమని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. మరో పక్క దేశ వ్యాప్తంగా ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రచార కార్యక్రమాలతో జోరు మీదున్నారు.


జూలై 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో భారీ ఎత్తున బాహుబలి సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రభాస్, రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో రానా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా కనిపించనున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, సత్యరాజ్, సుధీప్, నాజర్, అడవి శేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


ఈ డాల్బీ అట్మాస్ పరిజ్ఞానంద్వారా 3D సౌండ్ అనుభూతికలుగుతుంది. రియాలిటీకి దగ్గరగా వున్న ఈ పరిజ్ఞానాన్ని ఇదివరకు విశ్వరూపం సినిమాకు ఉపయోగించారు. ఇటువంటి ప్రయోగం చేయడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం


‘బాహుబలి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యం కోసం ఇద్దరు అన్నాదమ్ముల మధ్య జరిగే పోరాటమే బాహుబలి' . ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులు. రానా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు.

English summary
SS Rajamouli, revealed that the overall budget for both parts of Bahubali is more than 250 crore.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu