»   » కష్టే ఫలి...అదే బాహుబలి :'బాహుబలి-2' కు భారీ ఆఫర్‌!భాక్సాఫీస్ సెన్సేషన్

కష్టే ఫలి...అదే బాహుబలి :'బాహుబలి-2' కు భారీ ఆఫర్‌!భాక్సాఫీస్ సెన్సేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'బాహుబలి-2' . మండే ఎండల మధ్య షూటింగ్ స్పాట్‌లో కూలర్లు, ఏసీలు పెటుకుని మరీ షూటింగ్‌ శరవేగంగా చేస్తున్నారు. వీరి కష్టానికి తగిన ఫలితం దక్కబోతోందని తెలుస్తోంది.

అందుతున్న సమాచారం ప్రకారం...'బాహుబలి-2' హిందీ వెర్షన్ రైట్స్‌ ని పూర్తిగా ప్రఖ్యాత బాలీవుడ్ చిత్రనిర్మాణ యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌కు అమ్మాలని ఆర్కా మీడియా భావిస్తున్నట్లు సమాచారం.


Rajamouli's Baahubali 2 gets sensational offer

ప్రపంచవ్యాప్తంగా పంపిణీ హక్కులు, హిందీ వెర్షన్ హక్కులు, శాటిలైట్ హక్కుల కోసం మొత్తంగా రూ. 150 కోట్లు చెల్లించడానికి యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌ ముందుకొచ్చినట్టు చెప్తున్నారు. ఇంతకు ముందు కరణ్ జోహార్ 100 కోట్లు పెట్టి ఈ రైట్స్ ని తీసుకున్నారు.


'బాహుబలి: ద బిగినింగ్‌' హిందీ వెర్షన్‌ రూ. 100 కోట్లకుపైగా వసూలు చేసి పలు రికార్డులను బద్దలుకొట్టడంతో యష్ రాజ్ సంస్ద ఈ విషయమై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మరి కరుణ్ జోహార్ ఏమంటారో చూడాలి.


Rajamouli's Baahubali 2 gets sensational offer

ఇక ముందుగా అనుకున్నట్టే వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న 'బాహుబలి: ద కన్‌క్లూజన్‌'ను ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేయాలని దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్‌ నాటికే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు.


ప్రస్తుతం ప్రభాస్, రానా దగ్గుబాటి మధ్య యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఎండలు బాగా పెరిగిపోయిన నేపధ్యంలో 'బాహుబలి-2' చిత్రయూనిట్‌కు రాజమౌళి ఒక నెల సెలవు ప్రకటించినట్టు తెలుస్తోంది. ఈ సెలవు ముగిసిన వెంటనే సినిమా షూటింగ్‌ పునఃప్రారంభం కానుంది. ఈ బ్రేక్ తర్వాతనే సినిమాలో ప్రధాన యాక్షన్‌ ఘట్టమైన వార్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తారని తెలుస్తోంది.

English summary
Buzz is top production house Yash Raj Films offered a whopping Rs 150 crs for the Baahubali The Conclusion's Hindi rights.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu