»   » యూట్యూబ్ రికార్డ్: 'బాహుబలి'...ట్రైలర్ వ్యూస్ ఎన్నంటే...

యూట్యూబ్ రికార్డ్: 'బాహుబలి'...ట్రైలర్ వ్యూస్ ఎన్నంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ ‘బాహుబలి' . ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన నాటినుంచీ క్రేజ్ క్షణ క్షణానికి పెరిగిపోతూ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఇప్పుడు ఈ చిత్రం ట్రైలర్ రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. తమిళ,తెలుగు,హిందీ వెర్షన్ లు అన్ని కలిపి కోటి వ్యూస్ దాటాయి. ఈ విషయమై బాహుబలి టీమ్ పండుగ చేసుకుంటోంది. తెలుగులో 31 లక్షలు వ్యూస్ వచ్చాయి.

రాజమౌళి మాట్లాడుతూ... బాహుబలి ఫస్ట్ పార్ట్ ఖర్చు రూ. 150 కోట్లు అయిందని.... సెకండ్ పార్టు పూర్తయే వరకు సినిమా మొత్తం బడ్జెట్ రూ. 250 కోట్లు అవుతుందని తెలిపారు. 2016లో బాహుబలి సెకండ్ పార్ట్ విడుదల చేయబోతున్నట్లు రాజమౌళి వెల్లడించారు.


ఇండియన్ సినిమా చరిత్రలో ఇదే అతిపెద్ద సినిమా అని చెప్పొచ్చు. ఇంత ఖర్చు ఇప్పటి వరకు ఏ సినిమాకు పెట్టలేదు. ఇంత భారీ బడ్జెట్ చూసి భారతీయ సినీప్రియులు నోరెళ్ల బెడుతున్నారు. అయితే ఇంత బడ్జెట్ పెట్టిన నిర్మాతలు అంతకు రెట్టింపు రాబట్టుకునేందుకు పక్కా ప్లానింగుతో ముందుకు సాగుతున్నారు.


Rajamouli's Baahubali racing past 1 crore!!!

బాహుబలి సినిమాకు సంబంధించి ఓ హాలీవుడ్ స్టూడియోతో రూ. 500 కోట్ల డీల్ కుదిరినట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రముఖ హాలీవుడ్ సినీ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోతో రూ. 500 డీల్ కుదిరినట్లు సమాచారం. మార్కెటింగ్ కూడా భారీ ఎత్తున చేస్తున్నారు.


‘బాహుబలి' ఆడియో మే 31న హైటెక్స్‌లో జరుగాల్సి ఉండగా.... భద్రత కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆడియో వేడుక వాయిదా పడింది. దీంతో ప్రభాస్ అభిమానులు కాస్త డిసప్పాయింటుగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో బాహుబలి దర్శక నిర్మాతలు డిఫరెంటుగా థింక్ చేసారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘బాహుబలి' ఆడియో వేడుక రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడయితే అనుమతుల పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అంటున్నారు. స్థలం కూడా కావాల్సినంత ఉంటుంది కాబట్టి ఎంత మంది అభిమానులు వచ్చినా సమస్య ఉండదని అంటున్నారు. జులై 10న ఆడియో వేడుక నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.


ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి' థియేట్రికల్ ట్రైలర్ కు రెస్పాన్స్ అదిరిపోతోంది. తెలుగు, తమిళం, హిందీలో విడుదలైన ట్రైలర్ కు మిలయన్ల కొద్దీ హిట్స్ వచ్చాయి. ట్రైలర్ రెస్పాన్స్ చూస్తే సినిమాపై అంచనాలు ఏ రేంజిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సినిమా అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని అంటున్నారు.


రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలోనే ఇదో గొప్ప చిత్రంగా నిలిపోనుంది. అంతర్జాతీయ స్టాండర్ట్స్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి భాగం ‘బాహుబలి-ది బిగినింగ్' జులై 10 సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

English summary
The cumulative worth of views for the trailer of Baahubali uploaded in different versions all over YouTube now crossed 1 crore. For that reason.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu