'బాహుబలి 2' ట్రైలర్ చూసి గుండెలు అదిరిపోయాయిట

‘బాహుబలి-2’ చిత్రం ట్రైలర్ ని ఇప్పటికే రాజమౌళి సోదరుడు చూసి కామెంట్ చేసారు.

By Srikanya

హైదరాబాద్ : 'బాహుబలి' ఓ బ్రాండ్ గా మారింది. ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాలు.. గ్రాఫిక్స్.. యాక్టింగ్.. పలు అంశాల్లో దర్శకుడు రాజమౌళి ఓ స్టాండర్డ్స్ సెట్ చేశారు. ప్రస్తుతం 'బాహుబలి: ది కంక్లూజన్' తెరకెక్కుతోంది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి. మొదటి భాగంతో సెట్ చేసిన స్టాండర్డ్స్‌ను అధిగమించడానికి యూనిట్ అందరూ తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ట్రైలర్ ఎప్పుడు బయిటకు వస్తుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరో ప్రక్క మెల్లి మెల్లిగా చక్కటి స్ట్రాటజీతో బాహుబలి 2 చిత్రం కోసం రాజమౌళి ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాడు.ఇప్పటికే ప్రభాస్ కు సంబంధించిన కొన్ని పోస్టర్ లను విడుదల చేసిన రాజమౌళి త్వరలో ఆడియో వేడుకని కూడా భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Rajamouli’s brother tweet about Baahubali trailer

కాగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాహుబలి 2 చిత్రం ట్రైలర్ ని ముంబై వేదికగా ఈ నెల 15 న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ట్రైలర్ ని ఇప్పటికే చూసిన రాజమౌళి సోదరుడు...సంగీత దర్శకుడు కళ్యాణ్ రమణ(కళ్యాణ్ మాలిక్) సోషల్ మీడియాలో ఇలా స్పందించారు. ఆయన ఈ చిత్రానికి సౌండ్ ఎడిటర్ కూడా.

నా గుండెలు అదిరిపోయినీయ్!సినిమాతో సంబంధం లేకుండ ఇది విడిగా 100 రోజులు ఆడుతుంది అంటూ ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు ప్రభాస్ అభిమానులను మాత్రమే కాక సినీ ప్రియులందరినీ ఆనందంలో ముంచెత్తుతోంది.

మరో ప్రక్క ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ప్రభాస్, రానా, రాజమౌళి, తమన్నా, అనుష్క లు పాల్గొననున్నారు. ఏప్రిల్ 28 న విడుదల కానున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారనడంలో సందేహం లేదు.తారాస్థాయిలో అంచనాలు ఉన్న చిత్రానికి సంబందించిన ట్రైలర్ కూడా అదేస్థాయిలో అంచనాలు పెంచేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.

Rajamouli’s brother tweet about Baahubali trailer

మరో ప్రక్క మధ్యకాలంలో ఏ చిత్రం గురించి డిస్ట్రిబ్యూటర్స్ అంతగా ఎదురుచూడలేదేమో అన్నట్లుగా బాహుబలి 2 బిజినెస్ జరుగిందని ట్రేడ్ వర్గాల సమచారం. బాహుబలి చిత్రం తొలి భాగానికి రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావడంతో రెండో భాగం పైనే అందరి దృష్టీ ఉంది. సినిమా ఎప్పుడు బయటకు వస్తుందా, దాన్ని ఎలా పంపిణీ చేసి మంచి లాభాలు సంపాదించుదామా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఈ చిత్రం రేట్లు ఏ విధంగా ఉంటాయో ఊహించండి. నిర్మాతలు ఏ రేటు చెప్పినా మారు మాట మాట్లాడకుండా, బేరం ఆడకుండా కొనుక్కునే పరిస్దితి. నైజాం ఏరియా హక్కుల ను ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ ఈ హక్కులను కొనుగోలు చేశారని అఫీషియల్ గా బాహుబలి టీమ్ ప్రకటించింది.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం నైజాం రైట్స్ 50 కోట్లకు వెళ్లాయని సమాచారం. యాభై కోట్లు అంటే మాటలు కాదు . కానీ అంతకు మించి సంపాదించవచ్చు అనే నమ్మకంతో నారంగ్ బ్రదర్శ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X