రాజమౌళి ‘ఈగ’కు కాసుల పంట!
రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'ఈగ' చిత్రం విడుదలకు ముందే నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. 'ఈగ' చిత్రం తమిళ వెర్షన్ 'నాన్ ఈ' థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోవడమే ఇందుకు నిదర్శనం. చెన్నయ్ సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈచిత్రం తమిళ వెర్షన్‌ను ఓ నిర్మాత రూ. 5 కోట్లుకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
రాజమౌళి గతంలో దర్శకత్వం వహించిన 'మగధీర' చిత్రం తమిళ వెర్షన్ అప్పట్లో తమిళనాట మంచి వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో రాజమౌళి సినిమాలంటే అక్కడి ప్రేక్షకుల్లో క్రేజ్ పెరిగింది. పైగా 'ఈగ' చిత్రం సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కావడం, విజుల్ వండర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో అక్కడి నిర్మాతలు 'ఈగ' చిత్రాన్ని కొనడానికి పోటీ పడ్డారు.
'ఈగ' చిత్రాన్ని ఏపీతో పాటు తమిళనాడు, కర్నాటక, కేరళలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఒక్క తమిళనాడులోనే ఈచిత్రం 5 కోట్లకు అమ్ముడు పోయిందంటే ఓవర్సీస్‌తో కలిపి 'ఈగ' చిత్రానికి కాసుల పంట ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాజమౌళి చిత్రం కాబట్టి మాగ్జిమమ్‌గా ప్రేక్షకులు థియేటర్లకు ఒక్కసారైనా వస్తారనే నమ్మకంతో థియేటర్లను కూడా భారీగా కేటాయించారు.
తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ'గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై.. అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ'ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా 'ఈగ' కథాంశం.
సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది. సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మగధీర చిత్రానికి కెమెరామెన్‌గా పని చేసి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ చేశారు. జులై 6న ఈచిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











