»   » ‘బాహుబలి’చైనా రిలీజ్: అక్కడ ఎన్నో స్దానం, జాకీచాన్‌ కే కంగారు,షాకిచ్చే నిజాలు

‘బాహుబలి’చైనా రిలీజ్: అక్కడ ఎన్నో స్దానం, జాకీచాన్‌ కే కంగారు,షాకిచ్చే నిజాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గతేడాది జూలైలో విడుదలై దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన 'బాహుబలి'ఇప్పుడు చైనాలో రిలీజయ్యి అక్కడ తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. ఏడాది క్రితం విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ నిర్మాతలకు డబ్బులు తెచ్చే మిషన్ గా మారటం అందరినీ సినీ పరిశ్రమలవారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 కోట్లు కు పైగా కలెక్ట్ చేసిన ఈ చిత్రం, చైనా మార్కెట్ ని సైతం కుదిపేస్తోందని చెప్తున్నారు. మొన్న వీకెండ్ చైనాలో విడుదలైన ఈ చిత్రం మూడురోజుల్లోనే హాఫ్ మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంతేకాదు చైనా భాక్సాఫీస్ వద్ద టాప్ టెన్ లో తొమ్మిదవ స్దానం సాధించింది. మెయిన్ లాండ్ చైనాలో 3.9 Cr ($ 600k) ఓరినింగ్ వీకెండ్ సాధించింది.

రాజమౌళి తన బాహుబలి చిత్రం చైనీస్ వెర్షన్ ప్రమోషన్ బారీగా చేస్తున్నారు. అక్కడ ఈ చిత్రాన్ని 6,500 ప్రింట్లతో రిలీజ్ చేసారు. ఎందుకు రాజమౌళి ఇంతలా చైనాలో భారీ రిలీజ్ పెడుతున్నారు. కారణమేంటి అన్నదానికి ఆయన సమాధానమిచ్చారు.

రాజమౌళి మాట్లాడుతూ..... "వాస్తవానికి చైనాలో సినిమాని 6,500 ప్రింట్లతో రిలీజ్ చేస్తున్నాం. ఇది ఇండియా రిలీజ్ కన్నా మూడు రెట్లు ఎక్కువ. అందుకే మేం అక్కడ బాక్సాఫీస్ గురించి పూర్తి శ్రద్ద తీసుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కేవలం డిస్ట్రిబ్యూటర్స్ క్షేమం కోసమే కాదు, ఇండియా సినిమాలు మార్కెట్ ని పెంచటానికి చైనాలో రాబోయే మన సినిమాలు నిలబడి ఆడటానికి కూడాను ", అని రాజమౌళి వివరించారు. ఆ స్ట్రాటజీనే అక్కడ వర్కవుట్ అవుతోంది.

స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు...

20 కోత పెట్టి మరీ...

20 కోత పెట్టి మరీ...

బాహుబలి చైనా వెర్షన్..మరింత గ్రిప్పింగ్ గా ఉండటం కోసం దాదాపు ఇరవై నిముషాలు పాటు కోత పెట్టి మరీ రిలీజ్ చేసారు.

టార్గెట్

టార్గెట్

అమీర్ ఖాన్ చిత్రం పీకే చైనా కలెక్షన్స్ దాటటమే బాహుబలి టీమ్ టార్గెట్ గా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

అంతేకాదు...

అంతేకాదు...

ఇంటర్నేషనల్ స్టార్ జాకీచాన్ సినిమాకంటే బాహుబలికే ఎక్కువ ఆదరణ లభించిందట.

ఆశ్చర్యమే మరి

ఆశ్చర్యమే మరి

చైనాలో జాకీచాన్ ను సినిమాకు దేవుడిలా చూస్తారు. అలాంటిది అతని సినిమాకంటే బాహుబలికి విపరీతమైన క్రేజ్ రావటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అది చూసి రాజమౌళి థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యాడు.

రేటింగ్

రేటింగ్

ఈ సినిమాకు మొదట 7.1 ఉన్న రేటింగ్ ఇప్పుడు 7.7 కు చేరుకుంది. ఈ రేటింగ్ జాకీచాన్ మూవీకన్నా కూడా ఎక్కువ. చైనా వంటి దేశంలో ఒక తెలుగు సినిమా ఇంతటి ఆదరణను పొందడం నిజంగా సంతోషించదగ్గ విషయం.

ఎదురుచూపులు

ఎదురుచూపులు

చైనాలో తమ సినిమా ప్రమోషన్ కోసం బాహుబలి టీమ్ ఇటీవల అక్కడికి వెళ్లినప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. అక్కడ జనం ఆల్రెడీ సినిమా గురించి తెలుసుకుని, ఎదురుచూస్తున్నారట.

చైనా ఫైట్స్

చైనా ఫైట్స్

బాహుబలి లో... కాళకేయతో యుద్ధ సన్నివేశాలన్నీ చైనాకు చెందిన పోరాటాలుగా విశ్లేషకులు అభివర్ణించమే కలిసి వచ్చిది.

ఆయన ఎడిటింగ్..

ఆయన ఎడిటింగ్..

ప్రఖ్యాత హాలీవుడ్‌ ఎడిటర్‌ విన్సెంట్‌ టబిల్లాన్‌తో 'బాహుబలి' ఇంటర్నేషనల్‌ వర్షన్‌ను ఎడిట్‌ చేయించారు.

డిస్ట్రిబ్యూటర్స్

డిస్ట్రిబ్యూటర్స్

చైనాలో బాహుబలి పంపిణీ హక్కులను సొంతం చేసుకున్న ఈస్టార్స్ సంస్థ చాలా హ్యాపీగా ఉంది. ఈ నేపథ్యంలోనే చైనాలో సినిమా ప్రమోషన్స్ ఇంకా పెంచేసారు.

మీడియాతో ..

మీడియాతో ..

చైనా మీడియా సంస్థలకు చెందిన సుమారు 20 మంది ప్రతినిధులను బాహుబలి టీమ్ హైద్రాబాద్‌లో విందుకు ఆహ్వానించటం కూడా కలిసివచ్చిన అంశం.

క్రేజ్ కోసం స్ట్రాటజీగా

క్రేజ్ కోసం స్ట్రాటజీగా

పలు ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ఈ సినిమాను ప్రదర్శించి, ఆ ప్రదర్శనతో వచ్చిన క్రేజ్‌తో సినిమాను అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేసారు నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌ .

మార్కెట్ పెరుగుతుంది

మార్కెట్ పెరుగుతుంది

ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన బాహుబలి, పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేదికలపై మన సినిమా మార్కెట్ పెరిగే అవకాశాలను కల్పించింది.

ప్లస్సైంది

ప్లస్సైంది

బాహుబలి సినిమాకు సంబంధించిన ఇంటర్నేషనల్ వర్షన్ పలు దేశాల్లో విడుదలై అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవటం, హాలీవుడ్ మీడియా కూడా మాట్లాడటం ప్లస్ అయ్యింది.

కనీసం

కనీసం

ఇక్కడలా అక్కడా 'బాహుబలి' ప్రభంజనం సృష్టిస్తే... కనీసం రూ.200 కోట్లయినా కొల్లగొట్టడం ఖాయం. అంటే... 'పీకే' రికార్డు కూడా అధిగమించే అవకాశాలున్నాయన్నమాట. కనీసం రెండో స్థానంలో అయినా నిలిచే వీలు చిక్కుతుంది.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ

చైనా విడుదల కోసం...నేపథ్య సంగీతం విషయంలోనూ చిత్ర యూనిట్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని, సౌండ్ ట్రాక్ లు అక్కడ నేటివిటికి తగ్గట్లు కొన్ని మార్చినట్లు సమాచారం.

English summary
SS Rajamouli’s film 'Baahubali'was released in China last weekend and it took more than half million dollars in three days.it stood at 9th place in Chinese box-office's top-ten.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu