తమిళనాడు: ఈగ చేతిలో మగధీర రికార్డు ఢాం
దర్శకుడు రాజమౌళి తమిళనాడులో తన రికార్డు తానే బద్దలు కొట్టుకున్నాడు. తమిళనాడులో తెలుగు సినిమాల కలెక్షన్ల రికార్డు చూసుకుంటే ఇప్పటి వరకు 2009లో వచ్చిన 'మగధీర' టాప్. తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టింది 'ఈగ'. ఈ రెండు చిత్రాలకు దర్శకుడు రాజమౌళే కావడం గమనార్హం.
తమిళంలో 'నాన్ఈ' పేరుతో రిలీజైన ఈగ మూవీ మూడు వారాల్లో రూ. 18.22 కోట్లు వసూలు చేసింది. దీంతో మగధీర రికార్డు బద్దలయినట్లయింది. అసలు తమిళ సినిమా చరిత్రలోనే అక్కడ ఒక డబ్బింగ్ చిత్రం ఈ రేంజిలో కలెక్షన్లు కురిపించడం ఇదే తొలిసారి. తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా రిలీజైన 'బిల్లా 2' పోటీని తట్టుకుంటూ ఇన్ని వసూళ్లు సాధించడం విశేషమే మరి. తమిళనాడు వ్యాప్తంగా ఈచిత్రం ఇప్పటికీ 185 స్క్రీన్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది.
సుదీప్, సమంత, నాని హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ చిత్రం...కేవలం ఇండియన్ బాక్సాఫీసులోనే కాదు ఇంటర్నేషనల్ బాక్సాఫీసులోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈచిత్రం వసూళ్లు 50 కోట్లు దాటేసింది. మనికొన్ని నెలల్లో ఈగ చిత్రం హిందీలో 'మక్కి' పరుతో 3డిలో రిలీజ్ కాబోతోంది.
రాజమౌళి దర్శకత్వం, కళ్లు చెదిరే గ్రాఫిక్స్ అద్భుతాలు సినిమాను తెలుగు సినీ పరిశ్రమ గర్వపడే స్థాయికి తీసుకెళ్లాయి. ఈ చిత్రం కోసం రాజమౌళి ఎన్నడూ లేని విధంగా రెండు సంవత్సరాలు కష్ట పడ్డారంటే దీనిపై అతని కమిట్ మెంట్ ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈచిత్రానికి సంగీతం: కీరవాని, నిర్మాత: సాయి కొర్రపాటి, సమర్పణ: సురేష్ బాబు, దర్శకత్వం: రాజమౌళి


Click it and Unblock the Notifications











