'లింగా' తెలుగు వెర్షన్ క్లోజింగ్ కలెక్షన్స్(ఏరియావైజ్)

By Srikanya

హైదరాబాద్: రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా క్రితం నెల 12న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చిన చిత్రం 'లింగా'. ఈ చిత్రం ఆశించిన విధంగా హిట్ టాక్ ని తెచ్చుకోలేకపోయింది. అభిమానులు సైతం ఈ సినిమా రిలీజైన తొలి రోజునే పెదవి విరిచేసారు. అనుష్క, సోనాక్షి సిన్హాలు హీరోయిన్లు. ఈ చిత్రానికి కేఎస్. రవికుమార్ దర్శకత్వం వహించారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్ర ప్రపంచ వ్యాప్త విడుదల హక్కులను ఇరాస్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ సంస్థ నుంచి తమిళనాడు, కేరళ విడుదల హక్కులను వేందర్ మూవీస్ సంస్థ పొందింది.

మరి తెలుగు వెర్షన్ క్లోజింగ్ కలెక్షన్స్ ని ఓ సారి చూద్దాం...

నైజాం: 5.92 కోట్లు

సీడెడ్: 2.68 కోట్లు

ఉత్తర ఆంధ్రా: 1.57 కోట్లు

గుంటూరు: 0.98 కోట్లు

తూర్పు గోదావరి జిల్లా: 0.95 కోట్లు

పశ్చిమ గోదావరి జిల్లా: 0.69 కోట్లు

కృష్ణా : 0.8 కోట్లు
ఇండియాలో ఇతర ప్రాంతాలు: 0.52 కోట్లు

మొత్తం ఆంధ్రా,తెలంగాణా కలిపి : 14.11 కోట్లు

చిత్రం కథేమిటంటే...

లింగా(రజనీ) ఓ చిన్న దొంగ...అతని ఫ్రెండ్స్(సంతానం)తదితరులతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూన్న అతన్ని పబ్లిక్ టీవి రిపోర్టర్ లక్ష్మి(అనుష్క) ఓ సారి జైలు నుంచి బయిటకు తీసుకు వస్తుంది. అయితే ఓ కండీషన్ పెడుతుంది..అదేమిటంటే... శింగనూర్ అనే ఓ గ్రామం వచ్చి అక్కడ అతని తాతగారు రాజా లింగేశ్వర(ఇంకో రజనీ) కట్టించిన గుడిని ఓపెన్ చెయ్యాలని. అయితే మొదట లింగా రిజెక్టు చేస్తాడు...తమని ఈ దొంగతనాలు చేసే స్ధితికి వెళ్ళేలే చేసి, దరిద్రంలో వదిలిన తమ తాత అంటే అసహ్యమని చెప్తాడు.

అయితే తప్పని సరి పరిస్దితుల్లో అక్కడికి వెళ్తాడు. అక్కడ లక్ష్మి తాతగారు(కె. విశ్వనాధ్) ఆ గుడి గురించి ఓ రహస్యం చెప్తాడు. అది విన్న లింగా ఆ గుడిని ఓపెన్ చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. అయితే లోకల్ ఎంపి నాగ భూషణం(జగపతిబాబు) అతనో దొంగ అని కుదరదంటాడు. ఈ లోగా లింగా తన తాతగారి గురించి ఓ షాకింగ్ నిజం తెలుసుకుంటాడు.

Rajani's Lingaa Telugu Closing

ఆయన గద్వాల్ రాజా లింగేశ్వరావు అని... ఆ రోజుల్లోనే(1940) కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన ఓ ఇంజినీంరు అని, మధురై కలెక్టర్ అని అర్దం చేసుకుంటాడు. అంత గొప్ప తన తాత తాము ఎందుకు ఇలా దరిద్రంతో బ్రతకాల్సి వస్తోంది. ఆ గుడికి ఉన్న రహస్యం ఏమిటి...ఇంతకీ తన తాత కట్టించిన డ్యామ్ గురించి అతను ఏం తెలుసుకున్నాడు..ఏం చేసాడు...మిగతా విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

సెన్సార్ బోర్డ్ నుంచి ‘యు' సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా సుమారు 2,300కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా చేసారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X