పి.వాసు దర్శకత్వంలో రజనీకాంత్, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'కథానాయకుడు' (ఇదివరకు 'కుచేలుడు'). ఈ సినిమా ఆడియో హక్కులు 2.25 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయి మరో రికార్డును సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ వెర్షన్లు రెండింటికి కలిపి ఈ ఎమౌంట్. ఈ ఆడియో రైట్స్ ని రిలయన్స్ గ్రూప్‌కు చెందిన బిగ్ మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. బిగ్ మ్యూజిక్ ఇదివరకు శేఖర్ కమ్ముల సినిమా 'హ్యాపీడేస్' ఆడియోను విడుదల చేసింది. జీవీ ప్రకాష్‌కుమార్ సమకూర్చిన బాణీలు వినసొంపుగా వున్నాయని యూనిట్ వర్గాలు ద్వారా తెలుస్తోంది. అయితే ఓ కొత్త సంగీత దర్శకుడు మొదటి సినిమా ఆడియోకు ఇంత ధర పలకడం రికార్డు. ఇక దీనికి కారణం ప్రకాష్ కాదనీ, రజనీకాంత్ అనీ అందరికీ తెలిసిందే. జూన్ 30న చెన్నైలో జరిగే భారీ వేడుకలో రెండు భాషల ఆడియోను విడుదల చేయనున్నారు.