Vettaiyan Day 12 Collection: దారుణంగా పడిపోయిన రజనీ మూవీ కలెక్షన్లు.. 12 వ రోజు వేట్టయాన్ కు ఎన్ని కోట్లంటే?
Vettaiyan Day 12 Collections: సూపర్ స్టార్ రజనీకాంత్,బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ నటించిన భారీ బడ్జెట్ మూవీ వేట్టయాన్. ఈ భారీ బడ్జెట్ మూవీ అక్టోబర్ 10న భారీ అంచనాలతో విడుదల అయిన విషయం తెలిసిందే. జై భీమ్ ఫేమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన వేట్టయాన్ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ, కలెక్షన్ల పరంగా మాత్రం బెటరే అనిపిస్తోంది. ఇంతకీ వేట్టయాన్ మూవీ విడుదలైన 12 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో? ఈ మూవీ రోజు వారీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
వేట్టయాన్ మూవీ సక్సెస్ పుల్ డైరెక్టర్ TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించారు. ఈ మూవీని దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాను 148 రోజుల్లో చిత్రీకరించారు. ఈ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లతో పాటు మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

ఇక రజని కాంత్ వేట్టయాన్ కలెక్షన్ల విషయానికి వస్తే.. వేట్టయాన్ విడుదలైన తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 31.7 కోట్లు వసూళు చేయగా.. వర్డల్ వైడ్ గా రూ. 68.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ ఏడాది కోలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన రెండవ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వేట్టయాన్ రెండవ రోజు రూ.24 కోట్లు, మూడో రోజు రూ.26.75 కోట్లు, నాలుగో రోజు రూ. 22.30 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్ లో ప్రపంచ వ్యాప్తంగా (మొదటి నాలుగు)రోజుల్లో వేట్టయాన్ రూ.240 కోట్లు కలెక్ట్ చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ లైకా అధికారికంగా ప్రకటించింది.
ఇక 5వ రోజు నుంచి వేట్టయాన్ వసూళ్లు తగ్గాయి. 6వ రోజు బాక్సాఫీస్ వద్ద వేట్టాయన్ కేవలం రూ.5.60 కోట్లు వసూలు చేసింది. ఇక 6వ రోజు రూ.4.30 కోట్లు, 7వ రోజు రూ.4.5 కోట్లు, 8వ రోజు రూ.3.15 కోట్లు వసూలు చేసింది. ఇలా మొదటి వారం రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ 122.15 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక తొమ్మిదో రోజు అత్యల్పంగా రూ. 2.6 కోట్లు మాత్రమే వసూళ్లు చేసింది వేట్టయాన్. ఇక రెండవ వీకెండ్ లో రజినీ వేట్టయన్ మూవీ కలెక్షన్లు పెరిగాయి. పదవ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 4.25 కోట్లు కలెక్ట్ చేయగా..11 వ రోజు 5 కోట్లు రాబట్టింది.

12 వ రోజు వేట్టయాన్ కలెక్షన్ల వివరాలకు వస్తే.. రజనీకాంత్ మూవీ వసుళ్లు ఘోరంగా పడిపోయాయి. ఎంటర్‌టైన్‌మెంట్ ట్రాకింగ్ పోర్టల్ Sacnilk ప్రకారం.. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ సినిమా వేట్టయాన్ మూవీ పన్నేండవ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 1.85 కోట్లు రాబట్టింది.దీంతో వేట్టయాన్ మొత్తం నికర వసూళ్లు రూ. 136.45 కోట్లకు చేరుకుంది. 12వ రోజు నాడు తమిళనాడు థియేటర్లలో 14.13 శాతం ఆక్యుపెన్సీని సొంతం చేసుకోగా.. తెలుగులో 12.58 శాతం ఆక్యుపెన్సీ, హిందీ బెల్ట్ లో 5.66 శాతం ఆక్యుపెన్సీని సొంతం చేసుకుంది వేట్టయాన్.


Click it and Unblock the Notifications











