Vettaiyan Day 11 Collection: సెకండ్ వీకెండ్ సాలిడ్ రెస్పాన్స్.. 11 వ రోజు వేట్టయాన్ కు ఎన్ని కోట్లంటే?

Vettaiyan Day 11 Collections: సూపర్ స్టార్ రజనీకాంత్ - బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ నటించిన భారీ బడ్జెట్ మూవీ వేట్టయాన్. ఈ మల్టీ స్టారర్ మూవీ అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ అంచనాలతో విడుదల అయిన విషయం తెలిసిందే. జై భీమ్ ఫేమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ వేట్టయాన్ తొలి షో నుంచే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ, కలెక్షన్ల పరంగా మాత్రం కాస్త బెటరే అనిపిస్తోంది. ఇంతకీ వేట్టయాన్ విడుదలైన పదకొండు రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ? రోజు వారీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

జై భీం ఫేమ్ డైరెక్టర్ TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాను 148 రోజుల్లో చిత్రీకరించారు. మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లతో పాటు మంజు వారియర్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా దగ్గుబాటి, కిశోర్‌, అభిరామి, రితికా సింగ్‌, దుషారా విజయ్‌, రోహిణి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు.

Rajinikanth and Amitabh Bachchan starrer movie Vettaiyan Day 11 Box Office Collections Worldwide

ఇక వేట్టయాన్ కలెక్షన్ల విషయానికి వస్తే.. వేట్టయాన్ విడుదలైన తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 31.7 కోట్లు కలెక్ట్ చేయగా.. వర్డల్ వైడ్ గా రూ. 68.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి..ఈ ఏడాది కోలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన రెండవ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెండవ రోజు రూ.24 కోట్లు, మూడో రోజు రూ.26.75 కోట్లు, నాలుగో రోజు రూ. 22.30 కోట్లు వసూలు చేసింది. అయితే.. ఫస్ట్ వీకెండ్ లో ప్రపంచ వ్యాప్తంగా (మొదటి నాలుగు)రోజుల్లో వెట్టయాన్ రూ.240 కోట్లు వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ లైకేవ్ అధికారికంగా ప్రకటించింది.

ఇక 5వ రోజు నుంచి వసూళ్లు తగ్గాయి. ఆ రోజు బాక్సాఫీస్ వద్ద వేట్టాయన్ కేవలం రూ.5.60 కోట్లు వసూలు చేసింది. 6వ రోజు రూ.4.3 కోట్లు , 7వ రోజు రూ.4.5 కోట్లు , 8వ రోజు రూ.3.15 కోట్లు రాబట్టింది వేట్టయాన్. ఇలా మొదటి వారం రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ 122.15 కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక తొమ్మిదో రోజు (శుక్రవారం) కేవలం రూ.2.6 కోట్లు వసూళ్లు చేసింది వేట్టయాన్. ఇక రెండవ వీకెండ్ లో కలెక్షన్లు పెరిగాయి. దీంతో పదవ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 4.25 కోట్లు (నెట్ ) కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

Rajinikanth and Amitabh Bachchan starrer movie Vettaiyan Day 11 Box Office Collections Worldwide

ఇక వేట్టయాన్ 11వ రోజు కలెక్షన్ల వివరాలకు వస్తే.. ఎంటర్‌టైన్‌మెంట్ ట్రాకింగ్ పోర్టల్ Sacnilk ప్రకారం.. వేట్టయాన్ మూవీ పదకొండవ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 5 కోట్లు రాబట్టింది. ఇలా ఐదు రోజుల తరువాత వేట్టయాన్ మూవీ 11వ రోజున రూ.5 కోట్ల మార్కును చేరుకుంది. దీంతో వేట్టయాన్ నికర వసూళ్లు రూ. 134.25 కోట్లకు చేరుకుంది. రెండవ ఆదివారం తమిళనాడు థియేటర్లలో 30.10 శాతం ఆక్యుపెన్సీని సొంతం చేసుకోగా.. తెలుగులో 19.21 శాతం ఆక్యుపెన్సీ, హిందీ బెల్ట్ లో 12.49 శాతం ఆక్యుపెన్సీని సొంతం చేసుకుంది వేట్టయాన్. వీకెండ్ కావడంతో కలెక్షన్లు పెరిగినట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X