Vettaiyan Day 13 Collection: రజనీకాంత్ వసూళ్ల వేట ముగిసినట్టేనా.. 13వ రోజు వేట్టయాన్ కు ఎన్ని కోట్లంటే?

Vettaiyan Day 13 Collections: సూపర్ స్టార్ రజనీకాంత్ - డైరెక్టర్ TJ జ్ఞానవేల్ కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ వేట్టయాన్. ఈ భారీ బడ్జెట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 10న భారీ అంచనాలతో విడుదల అయిన విషయం తెలిసిందే. దాదాపు మూడున్నర దశాబ్దాల తరువాత రజనీ కాంత్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన మూవీ వేట్టయాన్. ఈ మూవీ యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నా.. కలెక్షన్ల పరంగా మాత్రం బెటరే అనిపిస్తోంది. ఇంతకీ వేట్టయాన్ మూవీ విడుదలైన 13 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో? ఈ మూవీ రోజు వారీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

వేట్టయాన్ కి జై భీమ్ ఫేం డైరెక్టర్ TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించారు. ఈ మూవీ కోసం దాదాపు 300 కోట్లు వేచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను 148 రోజులు షూట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మూవీకి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు.ఈ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లతో పాటు మంజు వారియర్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా దగ్గుబాటి, కిశోర్‌, అభిరామి, రితికా సింగ్‌, దుషారా విజయ్‌,రోహిణి తదితరులు లీడ్ రోల్ లో నటించారు.

Rajinikanth and Amitabh Bachchan starrer movie Vettaiyan Day 13 Box Office Collections Worldwide

ఇక రజనీకాంత్ వేట్టయాన్ కలెక్షన్ల విషయానికి వస్తే.. వేట్టయాన్ విడుదలైన మొదటి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.31.7 కోట్లు వసూళు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.68.4 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ ఏడాది తమిళ చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన రెండవ సినిమాగా రికార్డు స్రుష్టించింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వేట్టయాన్ రెండవ రోజు రూ.24 కోట్లు, మూడో రోజు రూ.26.75 కోట్లు, నాలుగో రోజు రూ. 22.30 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా (మొదటి నాలుగు)రోజుల్లో వేట్టయాన్ రూ.240 కోట్లు కలెక్ట్ చేసినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు.

ఇక మొదటి వారం నుంచి వేట్టయాన్ భారీగా వసూళ్లు తగ్గాయి. 5 రోజు బాక్సాఫీస్ వద్ద వేట్టాయన్ కేవలం రూ.5.60 కోట్లు రాబట్టింది. ఇక 6వ రోజు రూ.4.30 కోట్లు, 7వ రోజు రూ.4.5 కోట్లు, 8వ రోజు రూ.3.15 కోట్లు కలెక్ట్ చేసింది వేట్టాయన్. ఇలా మొదటి వారం రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ 122.15 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక తొమ్మిదో రోజు అత్యల్పంగా రూ. 2.6 కోట్లు మాత్రమే వసూళ్లు చేసింది వేట్టయాన్. ఇక రెండవ వీకెండ్ లో రజినీ వేట్టయన్ మూవీ కలెక్షన్లు పెరిగాయి. పదవ రోజు రూ. 4.25 కోట్లు కలెక్ట్ చేయగా..11 వ రోజు 5.35 కోట్లు రాబట్టింది. ఇక 12వ రోజు రూ. 1.85 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది.

Rajinikanth and Amitabh Bachchan starrer movie Vettaiyan Day 13 Box Office Collections Worldwide

13వ రోజు వేట్టయాన్ కలెక్షన్ల వివరాలకు వస్తే.. రజనీకాంత్ మూవీ వసుళ్లు ఘోరంగా పడిపోయాయి. ఎంటర్‌టైన్‌మెంట్ ట్రాకింగ్ పోర్టల్ Sacnilk ప్రకారం.. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కాంబో సినిమా వేట్టయాన్ మూవీ పదమూడవ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 1.75 కోట్లు రాబట్టింది.దీంతో వేట్టయాన్ మొత్తం నికర వసూళ్లు రూ. 138 కోట్లకు చేరుకుంది. 12వ రోజు నాడు తమిళనాడు థియేటర్లలో 13.87% ఆక్యుపెన్సీని సొంతం చేసుకోగా.. తెలుగులో 11.75% ఆక్యుపెన్సీ, హిందీ బెల్ట్ లో 4.78% ఆక్యుపెన్సీని సొంతం చేసుకుంది వేట్టయాన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X