Vettaiyan Day 14 Collection: దారుణంగా పడిపోయిన రజనీ మూవీ కలెక్షన్లు.. 14 వ రోజు వేట్టయాన్ కు ఎన్ని కోట్లంటే?

Vettaiyan Day 14 Collections: సూపర్ స్టార్ రజనీకాంత్ - బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ నటించిన భారీ బడ్జెట్ మూవీ వేట్టయాన్. ఈ మల్టీ స్టారర్ మూవీ అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ అంచాలతో విడుదల అయిన విషయం తెలిసిందే. జై భీమ్ ఫేమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ కాంబోలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ వేట్టయాన్ యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నా.. కలెక్షన్ల పరంగా మాత్రం బెటరే అనిపిస్తోంది. ఇంతకీ వేట్టయాన్ మూవీ విడుదలైన 14 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో? ఈ మూవీ రోజు వారీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

డైరెక్టర్ TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లతో పాటు మంజు వారియర్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా దగ్గుబాటి, కిశోర్‌, అభిరామి, రితికా సింగ్‌, దుషారా విజయ్‌, రోహిణి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు. ఈ మల్లీ స్టార్స్ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లి రాజా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ యాక్షన్ మూవీ కోసం దాదాపు 300 కోట్లు వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.

Rajinikanth and Amitabh Bachchan starrer movie Vettaiyan Day 14 Box Office Collections Worldwide

ఇక రజనీకాంత్ వేట్టయాన్ కలెక్షన్ల విషయానికి వస్తే.. వేట్టయాన్ విడుదలైన మొదటి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.31.7 కోట్లు వసూళు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.68.4 కోట్లు కలెక్ట్ చేసింది. వేట్టయాన్ రెండవ రోజు రూ.24 కోట్లు, మూడో రోజు రూ.26.75 కోట్లు, నాలుగో రోజు రూ. 22.30 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా (మొదటి నాలుగు)రోజుల్లో వేట్టయాన్ రూ.240 కోట్లు కలెక్ట్ చేసినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు.

ఇక మొదటి వారం నుంచి వేట్టయాన్ భారీగా వసూళ్లు తగ్గాయి. 5 రోజు బాక్సాఫీస్ వద్ద వేట్టాయన్ కేవలం రూ.5.60 కోట్లు రాబట్టింది. ఇక 6వ రోజు రూ.4.30 కోట్లు, 7వ రోజు రూ.4.5 కోట్లు, 8వ రోజు రూ.3.15 కోట్లు కలెక్ట్ చేసింది వేట్టాయన్. ఇలా మొదటి వారం రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ 122.15 కోట్లు కలెక్ట్ చేసింది.

ఇక తొమ్మిదో రోజు (రెండవ శుక్రవారం) అత్యల్పంగా రూ. 2.6 కోట్లు మాత్రమే వసూళ్లు చేసింది వేట్టయాన్. కానీ, రెండవ వీకెండ్ లో రజినీ వేట్టయన్ మూవీ కలెక్షన్లు పెరిగాయి. పదవరోజు (రెండవ శనివారం )రూ. 4.25 కోట్లు కలెక్ట్ చేయగా..11 వ రోజు (రెండవ ఆదివారం)రూ. 5.35 కోట్లు రాబట్టింది. ఇక 12వ రోజు రూ.1.95 కోట్లు, 13వ రోజు రూ.1.8 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది.

Rajinikanth and Amitabh Bachchan starrer movie Vettaiyan Day 14 Box Office Collections Worldwide

14వ రోజు వేట్టయాన్ కలెక్షన్ల వివరాలకు వస్తే..రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ సినిమా 'వెట్టయన్' విడుదలై 14 రోజులు పూర్తి చేసుకున్న బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతునే ఉంది. సక్‌నిల్క్ నివేదిక ప్రకారం 14వ రోజున వేట్టయాన్ మూవీ రూ. 1.65 కోట్లు రాబట్టింది.

ఆక్యుపెన్సీ పరంగా చూసుకుంటే.. తమిళ ఆక్యుపెన్సీ రేటు 14.52%, తెలుగు ఆక్యుపెన్సీ 11.39%, హిందీ ఆక్యుపెన్సీ 6.68% గా నమోదైంది. అక్టోబర్ 23, 2024 నాటికి.. వేట్టయాన్ మూవీ భారతదేశంలో సుమారుగా రూ.140 కోట్లు వసూలు చేసింది. అలాగే..ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 240 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. కానీ, మొత్తానికి రజనీకాంత్ మూవీ వసుళ్లు ఘోరంగా పడిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X