twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Annaatthe 5th day collections బాక్సాఫీస్‌ను రఫాడిస్తున్న రజనీకాంత్.. 200 కోట్ల క్లబ్‌లోకి అన్నాతే

    |

    దీపావళీ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. నయనతార, కీర్తీ సురేష్‌, కుష్భూ, మీనాతో కలిసి రజనీకాంత్ నటించిన అన్నాతే (తెలుగులో పెద్దన్న) తమిళనాడుతోపాటు ఓవర్సీస్‌లో కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. ఈ చిత్రం తొలి వారంలోనే 200 క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతున్నది. గత 5 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయంటే..

    రజనీకాంత్ చరిష్మా, మ్యాజిక్‌తోనే..

    రజనీకాంత్ చరిష్మా, మ్యాజిక్‌తోనే..

    రెండు లాక్‌డౌన్ తర్వాత రిలీజైన రజనీకాంత్ తొలి చిత్రం ఎలాంటి సందడి లేకుండానే థియేటర్లలోకి వచ్చింది. సినిమా రిలీజ్‌కు ముందు రజనీకాంత్ హాస్పిటల్ పాలు కావడంతో ప్రమోషన్స్‌ ఎక్కడా పెద్దగా కనిపించలేదు. అయితే రజనీకాంత్ చరిష్మా, మ్యాజిక్ మాత్రమే ఈ సినిమా రికార్డు కలెక్షన్లు కురిపించడానికి కారణమని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

     అన్నాతేకు మిశ్రమ స్పందన

    అన్నాతేకు మిశ్రమ స్పందన

    నవంబర్ 4వ తేదీన రిలీజైన అన్నాతే చిత్రం అన్ని వర్గాల నుంచి మిశ్రమ స్పందనను చూరగొన్నది. అయితే తలైవా అభిమానులను మాత్రం ఈ సినిమా ఊర్రూతలూగిస్తున్నది. చాలా కాలంగా ఎదురు చూసిన తలైవా ఫ్యాన్స్‌ మాత్రం అన్నాతే సినిమాతో థియేటర్లలో పండుగు చేసుకొంటున్నారు.

     తమిళనాడులో తుఫాన్‌ను ఎదురించి..

    తమిళనాడులో తుఫాన్‌ను ఎదురించి..

    అన్నాతే చిత్రం తమిళనాడులో లాక్‌డౌన్ తర్వాత అతిపెద్ద చిత్రంగా రిలీజైంది. తొలి రోజున ఈ చిత్రం రికార్డు స్థాయిలో 34.92 కోట్లు తమిళనాట వసూలు చేసింది. రెండో రోజున 27.15 కోట్ల రూపాయలు, మూడో రోజున 21.30 కోట్లు, నాలుగో రోజున 17.86 కోట్లు, ఐదో రోజున రూ.7.41 కోట్లు రాబట్టింది. దాంతో తమిళనాడులో రూ.108.64 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. తమిళనాడును తుఫాన్ ముంచెత్తినా గానీ భారీ కలెక్షన్లను సాధించడం రజనీ స్టామినాకు అద్దం పట్టింది.

    తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు వసూళ్లు

    తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు వసూళ్లు

    ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. పెద్దన్న చిత్రం 5వ రోజున నైజాంలో 12 లక్షలు, సీడెడ్‌లో రూ.8 లక్షలు, ఉత్తరాంధ్రలో 4 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.3 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 లక్షలు, గుంటూరులో రూ.2 లక్షలు, కృష్ణా జిల్లాలో 2 లక్షలు, నెల్లూరులో 1 లక్ష వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 34 లక్షలు నికరంగా, 55 లక్షలు గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

    ఏపీ, నైజాంలో 5వ రోజుల కలెక్షన్లు

    ఏపీ, నైజాంలో 5వ రోజుల కలెక్షన్లు

    ఇక ఐదు రోజుల ఏపీ, నైజాం కలెక్షన్లను పరిశీలిస్తే.. పెద్దన్న చిత్రం రూ.3.5 కోట్లు నెట్, 6.20 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.12.5 కోట్ల మేర జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 13 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అయితే ఇంకా రూ.9.5 కోట్లు వసూలు చేస్తే గానీ లాభాల్లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    Recommended Video

    Nayanthara ఫోటో కి ఫోజ్ ఇచ్చిందా..? అంటూ నెటిజన్ల అనుమానాలు!! || Filmibeat Telugu
    200 కోట్ల రూపాయల క్లబ్‌లోకి

    200 కోట్ల రూపాయల క్లబ్‌లోకి

    అన్నాతే చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను నమోదు చేసింది. లాక్‌డౌన్ తర్వాత భారీ కలెక్షన్లను కొల్లగొట్టిన భారతీయ చిత్రంగా అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది. ప్రపంచవ్యాప్తంగా అన్నాతే కలెక్షన్లను చూసుకొంటే.. తొలి రోజున 70.19 కోట్లు, రెండో రోజున రూ.42.63 కోట్లు, మూడో రోజున 33.71 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 28.20 కోట్లు, ఐదో రోజున 17.5 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఈ చిత్రం రూ.192.23 కోట్ల మేర కలెక్షన్లను నమోదు చేసింది. త్వరలోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం కనిపిస్తున్నది.

    English summary
    Super Star Rajinikanth's latest movie Annaatthe is doing well at box office. This movie Collections are very strong in Worldwide. It registered 192 crores worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X