జైలర్, భోళా శంకర్ అడ్వాన్స్ బుకింగ్ రచ్చ.. బాక్సాఫీస్ పోరులో చిరంజీవి, రజనీకాంత్ నువ్వా? నేనా?
పంద్రాగస్టు కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఇండియన్ సూపర్‌స్టార్స్ రజనీకాంత్ నటించిన జైలర్, చిరంజీవి నటించిన సినిమా భోళా శంకర్ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు కూడా పోటాపోటీగా వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో సాధిస్తున్నాయి. రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా 10వ తేదీన, భోళా శంకర్ చిత్రం ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సాధిస్తున్న అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రానికి హైదరాబాద్‌లో భారీ ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి. తొలి రోజు ఈ సినిమా కోసం 325 షోలు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 38 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 1 కోటి రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది.

జైలర్ సినిమా ఓవర్సీస్‌లో మంచి స్పందనను రాబట్టుకొంటున్నది. మలేషియాలో 265 షోలు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే 11 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో 46 లక్షల రూపాయాలు వసూలు అయ్యాయి. ఇక యూకేలో ఈ చిత్రం 60 లక్షల రూపాయలు వసూలు చేసింది.
ఇక భోళా శంకర్ సినిమాకు హైదరాబాద్‌లో మంచి రెస్సాన్ లభిస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించి 45 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఇప్పటికే 223 షోల ద్వారా 1 కోటి రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది. ఇంకా రెండు రోజులు ఉంది కాబట్టి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.

ఓవర్సీస్‌లో భోళా శంకర్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఈ చిత్రాన్ని 191 లోకేషన్లలో రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 550 షోలు ప్రదర్శిస్తున్నారు. మొత్తంగా 110K డాలర్లను వసూలు చేసింది. యూకేలో ఈ చిత్రానికి సంబంధించిన 60 షోల ద్వారా 4 వేల టికెట్లు అమ్ముడుపోయాయి.
ప్రపంచవ్యాప్తంగా జైలర్, భోళా శంకర్ చిత్రాలు పోటాపోటీగా వసూళ్లను సాధిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ ఫుల్ జోష్‌తో కనిపించడంతో బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా? అన్నట్టు కనిపిస్తున్నాయి. ఇంకా రెండు, మూడు రోజులు సమయం ఉంది కాబట్టి.. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఊపందుకొనే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











