RajiniKanth: 500కోట్లకు చేరువలో జైలర్ కలెక్షన్స్ ఏది.. ఇప్పుడు మొరగండి.. చూద్దాం?

రజనీకాంత్ నటించి జైలర్ సినిమా రిలీజ్ అయి 10 రోజులు అవుతున్నా.. కలెక్షన్లు మాత్రం ఆగడం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద రజినీ స్టామినా ఏంటో మరోసారి బహిర్గతం అవుతుంది. రజినీ కాంత్ మంచి మూవీతో మళ్లీ కం బ్యాక్ ఇచ్చేశారు. ఇక ఈ మూవీ నిర్మాతలకు కాసుల వర్షం అయితే కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో 'జైలర్' మూవీ 10 రోజుల కలెక్షన్స్ ఎంత రాబట్టిందో ఈ స్టోరీలో చూద్దాం.

సూపర్ స్టార్ రజినీ కాంత్... జైలర్ మూవీతో మళ్లీ కంబ్యాక్ ఇచ్చేశారు. ఇక ఈ మూవీతో ఆయన సత్తా ఏమిటో అర్ధం అవుతుంది. రజినీ పనైపోయింది... ఇక రెస్ట్ తీసుకోవాలి అనే వారికి తన మూవీతోనే కౌంటర్ ఇచ్చేశారు. ఏడు పదుల వయసులోనూ ఎక్కడ తగ్గని స్టైల్, స్వాగ్ తో ప్రేక్షకులను అలరించారు. జైలర్ మూవీతో వచ్చి... బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్నారు.

Rajinikanth Jailer Day10 Expected Collections worldwide

ఆగస్టు 10న రిలీజ్ అయిన జైలర్ మూవీ.. మొదటి రోజు నుంచే మంచి కలెక్షన్స్ రాబట్టింది. బీస్ట్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ మూవీకి దర్శకత్వం వహించారు. ఇక ఈ కామెడీ, యాక్షన్ జానర్లో వచ్చింది. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేయగా.. తమన్నా హీరోయిన్‌గా నటించింది. దీనికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ చేశాడు. ఇందులో సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబులు కీలక పాత్రల్లో కనిపించారు.

జైలర్ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజునే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా హక్కులకు వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తమిళనాడులో రూ. 62 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు, కర్నాటకలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో రూ. 122.50 కోట్లు బిజినెస్ అయింది.

Rajinikanth Jailer Day10 Expected Collections worldwide

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' మూవీకి 9 రోజుల్లో భారీ కలెక్షన్స్ అయితే వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.20 కోట్లు షేర్ వసూలు చేసింది. అలాగే, వరల్డ్ వైడ్‌గా రూ. 5 కోట్లు వరకూ రాబట్టింది. ఇలా 9 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 219 కోట్లు వరకూ షేర్, రూ. 450 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఇక, తెలుగులో లాభాలతో రికార్డు క్రియేట్ చేసింది జైలర్.

Rajinikanth Jailer Day10 Expected Collections worldwide

ఇక 10రోజు జైలర్ మూవీ లెక్కలు పరిశీలిస్తే... తెలుగు రాష్ట్రాల్లో 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా... తమిళ్ లో ఈ రోజు సినిమా 5 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.5 కోట్ల నుంచి 6 కోట్ల దాకా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి.

Rajinikanth Jailer Day10 Expected Collections worldwide

ఇక జైలర్ సినిమా 10వ రోజు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 18 కోట్ల రేంజ్ నుండి 19 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉందని తెలుస్తోంది. 10 రోజుల కలెక్షన్స్ కలుపుకుని ఈ మూవీ రూ.470 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్ట్ చేయొచ్చని తెలుస్తోంది. ఆఫ్ లైన్ టికెట్స్ కౌంట్ చేస్తే... 10రోజుల్లోనే ఈ మూవీ 500కోట్లు దాటిన ఆశ్చర్యం ఉండదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X