Jailer Advance booking అమెరికా, యూకేలో రజనీ బాక్సాఫీస్ మాయాజలం..రిలీజ్‌కు ముందే బాక్సాఫీస్ రచ్చ
సూపర్ స్టార్ రజనీకాంత్న నటించిన జైలర్ చిత్రం ఆగస్టు 15 కానుకగా రిలీజ్‌కు సిద్దమవుతున్నది. నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాటలు, ట్రైలర్ భారీ అంచనాలు పెంచాయి. తమన్నా గ్లామర్, రజనీకాంత్ వింటేజ్ లుక్ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి అంచనాల మధ్య ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్ భారీగా మొదలైంది. ఈ సినిమా బడ్జెట్, అడ్వాన్స్ బుకింగ్, ఇతర వివరాల్లోకి వెళితే..
రజనీకాంత్‌తోపాటు మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్యకృష్ణ, తమన్నా భాటియా, సునీల్ తదితరులు నటించిన జైలర్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమాకు భారీ బడ్జెట్ వెచ్చించారు. ఈ సినిమాను సుమారు 200 కోట్ల వ్యయంతో రూపొందించారు.

జైలర్ సినిమాలోని కావాలా పాట రిలీజ్ తర్వాత తమన్నా భాటియా ట్రెండింగ్‌గా మారింది. జైలర్ పాట సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్ రూపంలో ట్రెండ్ అవుతున్నాయి. దాంతో ఈ సినిమాకు యూత్ నుంచి మంచి కనెక్షన్ ఏర్పడింది.అలాగే తాజా ట్రైలర్ విడుదల తర్వాత రజనీకాంత్ కమ్ బ్యాక్ మూవీ అనే ప్రచారం జరుగుతున్నది.
జైలర్ సినిమాపై పెరుగుతున్న అంచనాలతో ఓవర్సీస్‌లో భారీగా అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. అమెరికా, బ్రిటన్, మలేషియా, సింగపూర్, దుబాయ్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో మంచి క్రేజ్ కనిపిస్తున్నది. ఇప్పటికే మొదలైన యూకే, అమెరికాలో భారీగా స్పందన కనిపిస్తున్నది.
అమెరికాలో జైలర్ అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన కనిపిస్తున్నది. అడ్వాన్స్ బుకింగ్ మొదలైన కొద్దిగంటల్లోనే ఈ సినిమా 75K డాలర్లను వసూలు చేసింది. ఈ సినిమా ప్రీమియర్ ద్వారానే ఒక మిలియన్ డాలర్లలో క్లబ్‌లో చేరే అవకాశం కనిపిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా రజనీ సినిమాకు మంచి జోష్ అభిమానుల్లో కనిపిస్తున్నది.
జైలర్ సినిమా యూకే అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే.. రజనీకాంత్ సినిమాకు భారీ రెస్సాన్స్ లభిస్తున్నది. ఏడు రోజు ఉండగానే.. ఈ సినిమాకు సంబంధించిన 5100 టికెట్లు బుక్ అయ్యాయి. 123 షోల ప్రదర్శిస్తుండగా ఇప్పటికే 60 లక్షల కలెక్షన్లను నమోదు చేసింది. రానున్న రోజుల్లో ఇతర దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్ నమోదయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











