Jailer Day 5 Collection: రజనీకాంత్ కలెక్షన్ల సంచలనం.. వర్కింగ్ డేలోనూ అన్ని కోట్లు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) గురించి ఏ ఒక్కరికి పరిచయం అవసరం లేదు. తన సినిమాలతో నిత్యం ఆకట్టుకునే తలైవా సుమారు నాలుగేళ్లుగా ప్లాప్స్ చవిచూశాడు. కానీ, ఆయన తాజాగా నటించిన జైలర్ (Jailer) సినిమా మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ రికార్డులు తిరగరాస్తోంది. ఈ నేపథ్యంలో జైలర్ మూవీ 5వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ లెక్కలు ఓసారి పరిశీలిస్తే..

నటీనటులు: కోకోకిల, వరుణ్ డాక్టర్, బీస్ట్ సినిమాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన సినిమానే జైలర్. సన్ పిక్చర్స్ సంస్థ బ్యానర్ లో జైలర్ నిర్మించగా ముద్దుగుమ్మ తమన్నా హీరోయిన్ గా చేసింది. అలాగే శివగామి రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ కీలక పాత్రలు పోషించారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ అతిథి పాత్రల్లో మెరిసారు.

Rajinikanth Jailer Movie Day 5 Expected Collections Worldwide

ప్రీరిలీజ్ బిజినెస్: తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే మొదటి నుంచే అంచనాలు భారీగా ఉంటాయి. అలాగే జైలర్ కూడా మంచి హైప్ పెరిగింది. అందుకు తగ్గట్లుగానే భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తమిళనాడులో రూ. 62 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు, కర్నాటకలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో వరల్డ్ వైడ్ గా రూ. 122.50 కోట్లు బిజినెస్ అయింది.

Rajinikanth Jailer Movie Day 5 Expected Collections Worldwide

5వ రోజు కలెక్షన్స్: ఆగస్ట్ 10న విడుదలైన జైలర్ సినిమాకు తొలి రోజు నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు హైలెట్ అని ప్రేక్షకులు చెబుతున్నారు. దీంతో సినిమాకు వసూళ్లు బాగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే జైలర్ మూవీకి 5వ రోజున రూ. 25 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Rajinikanth Jailer Movie Day 5 Expected Collections Worldwide

5 రోజులకు కలిపి: జైలర్ సినిమాకు తొలి రోజున రూ. 48.35 కోట్లు, 2వ రోజు రూ. 25.75 కోట్లు, 3వ రోజు రూ. 34.3 కోట్లు, 4వ రోజు రూ. 42.2 కోట్లు నెట్ ఇండియా కలెక్షన్స్ రాగా ఐదో రోజున రూ. 25 కోట్లుగా ఉంది. ఇవన్ని కలిపి మొత్తంగా 5 రోజుల్లో జైలర్ సినిమాకు రూ. 175.60 కోట్లు వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. వర్కింగ్ డే అయిన సోమవారం నాడు కూడా కలెక్షన్లు తగ్గలేదంటే రజనీ మార్క్ స్టైల్ మూవీగా జైలర్ ని చెప్పుకోవచ్చు.

Rajinikanth Jailer Movie Day 5 Expected Collections Worldwide

ఆక్యుపెన్సీ: రజనీకాంత్ లేటెస్ట్ మూవీ జైలర్ కు థియేటర్ ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది. అలా ఆగస్ట్ 14న తమిళనాడులో 56.31 శాతంగా ఓవరాల్ థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఇక తెలుగులో 50.95 శాతంగా రికార్డ్ అయింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ లో 54%, బెంగళూరులో 48.33%, వరంగల్ 41.67%, విజయవాడలో 38%, గుంటూరు 72.33%, వైజాగ్ 53.33%, కాకినాడ 71%, రాజమండ్రి 85.67 శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X