Jailer Day 7 Collection: ఎక్కడా తగ్గని రజనీ స్టామినా.. జైలర్ 7వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?
వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న హీరోలలో సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒకరు. అభిమానులు ఆయన్ను ముద్దుగా తలైవా అని పిలుచుకుంటారు. తనదైన స్టైలిష్ పర్ఫామెన్స్ తో అదరగొడతారు రజనీ కాంత్. సుధీర్ఘకాలంగా నటనతో సినీ రంగంపై తన మార్క్ చూపిస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా సినిమాల్లో ఓటమి చూసిన ఆయన ఇటీవల జైలర్ (Jailer Movie)గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో జైలర్ 7వ రోజు కలెక్షన్స్ లెక్కల్లోకి వెళితే..
మూడు సినిమాల తర్వాత:సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో ఆయనకు భార్యగా శివగామి రమ్యకృష్ణ నటించింది. నరసింహా, బాబా సినిమాల తర్వాత మళ్లీ రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ సీనియర్ హీరోయిన్. ఫ్యామిలీ ఎమోషన్, కామెడీ, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన జైలర్ సినిమా ఆగస్ట్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

ప్రీరిలీజ్ బిజినెస్:జైలర్ సినిమాకు రజనీకాంత్ మార్కెట్ కు తగినట్లుగానే బిజినెస్ జరిగింది. దీంతో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. అలా తమిళనాడులో రూ. 62 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు, కర్నాటకలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 122.50 కోట్లు బిజినెస్ అయింది. రూ. 124 కోట్లుగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏర్పడింది.
7వ రోజు ఎంతంటే?:తమన్నా హీరోయిన్ గా నటించిన జైలర్ సినిమాకు తొలి రోజు నుంచే కలెక్షన్స్ అదరగొడుతున్నాయి. తమన్నాతో పాటు అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు మరింత ప్లస్ కావడంతో జనాలు థియేటర్లకు ఎగబడుతున్నారు. దీంతో సినిమాకు వసూళ్లు బాగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జైలర్ చిత్రానికి 7వ రోజున రూ. 15 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

7 రోజుల్లో వచ్చింది:జైలర్ చిత్రానికి ఫస్ట్ డే రూ. 48.35 కోట్లు, 2వ రోజు రూ. 25.75 కోట్లు, 3వ రోజు రూ. 34.3 కోట్లు, 4వ రోజు రూ. 42.2 కోట్లు, ఐదో రోజున రూ. 23.55 కోట్లు, 6వ రోజున రూ. 36.5 కోట్లు, 7వ రోజు రూ. 15 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చాయి. ఇలా ఏడు రోజులకు కలిపి మొత్తంగా జైలర్ సినిమాకు రూ. 225.65 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

షేర్ కలెక్షన్స్-లాభం:రజనీకాంత్ జైలర్ సినిమాకు ఆగస్ట్ 16న యావరేజ్ గా తమిళంలో 38.56 శాతం, తెలుగులో 38.30 శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఇక దీనికి వరల్డ్ వైడ్ గా ఇప్పటికీ రూ. 197.35 కోట్ల షేర్ వచ్చింది. ఏడో రోజున ప్రపంచవ్యాప్తంగా రూ. 8 కోట్ల మేర షేర్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటికీ రూ. 73.35 కోట్ల ప్రాఫిట్ రాగా ఏడో రోజు మరింత పెరగనుంది.


Click it and Unblock the Notifications











