Jailer Pre Business రజనీకాంత్ మూవీకి దిమ్మ తిరిగే బిజినెస్.. జైలర్ ఎన్ని కోట్లు రాబడితే లాభాల్లోకి వస్తుందంటే?
సూపర్‌స్టార్ రజనీకాంత్, మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన జైలర్ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది. ఇటీవల ఓపెన్ చేసిన అడ్వాన్స్ బుకింగ్‌కు ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో భారీ కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా రిలీజ్‌కు ముందు చేసిన బిజినెస్ ఎంత? అనే ప్రశ్నలకు కావాల్సిన సమాధానాల్లోకి వెళితే..
జైలర్ సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీకి పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు వల్ల ఆసక్తి నెలకొన్నది. ఇక ఈ సినిమా ప్రొడక్షన్‌లో ఉండగానే రిలీజ్ చేసిన టీజర్లు, ట్రైలర్లు భారీ అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమాలోని పాటలు మరింత క్రేజ్‌ను పెంచాయి. ఇలాంటి అంచనాల మధ్య రజనీకి ఈ సినిమా కమ్ బ్యాక్ అవుతుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

జైలర్ సినిమాకు మంచి క్రేజ్, బజ్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో మిల్కి బ్యూటీ తమన్నా భాటియా కావాలా? అంటూ ఓ పాటలో వేసిన స్టెప్పులు ఈ సినిమాను ట్రెండింగ్‌లోకి తీసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా తమన్నా వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్ రూపంలో యూత్‌ను పిచ్చెక్కించాయి. ఇలాంటి అంశాలతో సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగింది.
జైలర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. తమిళనాడుకు సంబంధించిన థియేట్రికల్ హక్కులు భారీగా రేటు పలికాయి. తమిళనాడు థియేట్రికల్ హక్కులు 62 కోట్లుగా విలువ కట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో నైజాం, ఆంధ్రా హక్కులు 12 కోట్ల రూపాయలు, కన్నడ థియేట్రికల్ హక్కులు 10 కోట్ల రూపాయలు, కేరళ హక్కులు 6 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో బిజినెస్ 3 కోట్లు మేర విలువ కట్టారు.

జైలర్ సినిమా ఓవర్సీస్‌లో భారీ క్రేజ్ నెలకొన్నది. యూఎస్, యూకే, మలేషియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, యూరప్ దేశాల్లో భారీ రెస్పాన్స్ కనిపిస్తున్నది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు 30 కోట్ల మేర అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 123 కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఇక జైలర్ సినిమా రిలీజ్ తర్వాత లాభాల్లోకి రావాలంటే ఎంత వసూలు చేయాలనే విషయం ఆసక్తిగా మారింది. ఈ సినిమా సుమారుగా 125 కోట్ల షేర్, 240 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమాకు మంచి టాక్ వస్తే.. ఈ కలెక్షన్లు తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రికార్డు స్థాయిలో జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











