రజనీకాంత్ లాస్ట్ 5 మూవీస్ బాక్సాఫీస్.. హ్యయేస్ట్ ఎన్ని కోట్లు? ఏ సినిమాకంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గానూ మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఈ క్రమంలో 10 రోజుల్లో గ్రాండ్ గా విడుదల కాబోతున్న కూలి చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబడుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రజనీకాంత్ లాస్ట్ 5 మూవీస్ బాక్సాఫీస్ వివరాలను ఒకసారి పరిశీలిస్తే..

Vettaiyan (వెట్టయన్)
రజనీకాంత్ నుంచి చివరిగా 2024 అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వెట్టయన్. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించడం విశేషం. యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాస్తా వెనకబడింది. రెడ్ గెయింట్ మూవీస్ బ్యానర్ లో నిర్మాత సుభాస్కరన్ అల్లిరాజా రూ.300 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద టోటల్ గా 250 కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే దక్కాయి.

Rajinikanth Last 5 movies Box Office Collections

Lal Salaam (లాల్ సలామ్)
ఇక 2024 ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో చిత్రం లాల్ సలామ్. ఈ టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన చిత్రం లాల్ సలామ్ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని పొందింది. 80 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో రెడ్ గెయింట్ మూవీస్ బ్యానర్ లో నిర్మిస్తే డిజాస్టర్ అయ్యింది. కేవలం 20 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టిందని ట్రేడ్ నిపుణులు తేల్చారు.

Jailer (జైలర్)
టైగర్ ముత్తువెల్ పాండియన్ పాత్రతో జైలర్ సినిమాలో రజనీకాంత్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ 2023 ఆగస్టు 10న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. సన్ పిక్చర్స్ బ్యానర్ లో 200 కోట్ల రూపాయాలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 550 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. ఇప్పటి వరకు రజనీకాంత్ కెరీర్ లోనే హ్యయేస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ నా జైలర్ నిలిచింది.

Annaatthe (అన్నాత్తే)
రజనీకాంత్, ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేశ్ కలిసి నటించిన యాక్షన్ డ్రామా అన్నాత్తే. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించడం విశేషం. పీవీఆర్ పిక్చర్స్, రెడ్ గెయింట్ మూవీస్ బ్యానర్లలో 180 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించారు. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 140 కోట్లు మాత్రమే వసూళ్లు చేసిందని ట్రేడ్ నిపుణులు తెలిపారు.

Darbar (దర్బార్)
2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ దర్బార్. ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించారు. రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో అల్లిరాజా సుభాస్కరన్ 240 కోట్లతో నిర్మించారు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం 250 కోట్లు మాత్రమే వసూళ్లు చేసిందని బాక్సాఫీస్ రిపోర్ట్. అయితే ఇప్పటి వరకు రజనీ కెరీర్ లోనే జైలర్ సినిమానే హయ్యెస్ట్ వసూళ్లను కలిగి ఉండటం విశేషం. ఇక లోకేష్ కగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న కూలి చిత్రం ఆ రికార్డును బ్రేక్ చేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Read more about: rajinikanth coolie jailer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X