రజనీకాంత్ ‘కూలి’కి అత్యధిక పారితోషికం.. ఎన్ని వందల కోట్లో తెలుసా? షాకింగ్

సూపర్ స్టార్ రజనీకాంత్ 74 ఏళ్లలోనూ హీరోగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. యంగ్ హీరోలకు ధీటుగా యాక్షణ్ ఫిల్మ్స్ లో నటిస్తూ విశేషం. ఈ వయస్సులోనూ బాక్సాఫీస్ వద్ద కూడా రజనీకాంత్ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. తన చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నారు. 1977 నుంచి ఇప్పటి వరకు 170కి పైగా సినిమాల్లో నటించారు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్టర్ గా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న చిత్రాలు తీసుకుంటున్న రెమ్యునరేషన్ కూడా ఆసక్తికరంగా మారింది. తాజాగా కూలీ చిత్రానికి రజనీకాంత్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ రజనీకాంత్ ఎన్ని వందల కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారనే వివరాల్లోకి వెళితే...

రజనీకాంత్ 'కూలి' మూవీ వివరాలు..
కోలీవుడ్ లో 300 కోట్ల అత్యధిక బడ్జెట్ తో రూపు దిద్దుకుంటున్న చిత్రం 'కూలి'. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కింగ్ అక్కినేని నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ తో అదరగొట్టబోతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిథి మారన్ నిర్మించారు. అనిరుధ్ రవిచంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న గ్రాడ్ గా విడుదల కాబోతోంది.

Rajinikanth Remuneration for Coolie Movie

ఏషియాలో అత్యధిక పారితోషికం తలైవాకే..
ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటులు కేవలం నలుగురైదుగురు మాత్రమే ఉన్నారు. వారి పారితోషికాలు 200 నుంచి 300 కోట్ల మధ్యలో ఉంటుంది. నార్త్ లో షారుఖ్ ఒక్క సినిమాకే రూ.200 కోట్లకు పైగా ఛార్జ్ చేస్తుంటారు. ఇక సౌత్ లో ఆ స్థానాన్నిరజనీకాంత్ సొంతం చేసుకున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇప్పుడు ఇండియాలోనే హయ్యేస్ట్ పెయిడ్ యాక్టర్ ఎవరంటే రజనీకాంత్ అనే చెబుతున్నారు. అందుకు కారణం.. రజనీకాంత్ 'కూలి' చిత్రానికి రూ.260 నుంచి రూ.280 కోట్ల మధ్యలో పారితోషికం తీసుకున్నారంట. ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం అందుకున్న మొదటి నటుడు సౌత్ లో రజనీకాంత్ అనే అంటున్నారు. ఇప్పుడిప్పుడు ప్రభాస్, రామ్ చరణ్, జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్ రూ.100 నుంచి రూ.200 కోట్ల వరకు పారితోషికాలు అందుకుంటున్నారని అంచనా.

రజనీకాంత్ 'జైలర్' పారితోషికం..
రజనీకాంత్ చివరిగా 'జైలర్' చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. 2023 ఆగస్టు 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.650 కోట్ల వరకు వసూళ్లను అందుకుంది. దీంతో మొదటగా ఈ చిత్రానికి రజనీకాంత్ రూ.100 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నారు. కానీ ఫ్రాఫిట్స్ డబుల్ రావడంతో మరో రూ.110 కోట్లు పారితోషికం పొందారు. ఇలా రూ.210 కోట్లు అందుకొని అప్పుడు హిస్టరీ క్రియేట్ చేశారు.

రజనీకాంత్ నెక్ట్స్ ఫిల్మ్..
జైలర్, లాల్ సలామ్, వెట్టాయన్ వంటి చిత్రాల తర్వాత నెక్ట్స్ రజనీకాంత్ 'కూలి' చిత్రంతో అలరించబోతున్నారు. ఇది గాక ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్ 2' చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని కూడా సన్ పిక్చర్స్ బ్యానర్ లోనే రూపొందిస్తున్నారు. 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X