చైనాలో బాహుబలి రికార్డును బద్దలు కొట్టిన 2.0

రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన 2.0 మూవీ సెప్టెంబర్ 6న చైనాలో విడుదలైంది. ఇక్కడ ఈ చిత్రం భారీ సంఖ్యలో స్క్రీన్లలో విడుదల చేసినప్పటికీ ఓపెనింగ్స్ యావరేజ్‌గానే ఉన్నాయి. అయితే ఈ చిత్రం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి-ది బిగినింగ్' రికార్డులను బద్దలు కొట్టింది.

2.0 చిత్రాన్ని చైనా వ్యాప్తంగా 48,000 స్క్రీన్లలో విడుదల చేశారు. స్టార్ అలియన్స్ అనే సంస్థ 2.0 మూవీని చైనాలో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. తొలిరోజు చైనాలో $1.37 మిలియన్ వసూలు చేసింది. అయితే శని, ఆదివారాల్లో వసూళ్లు పెరుగుతాయని ఆశించారు కానీ అలాంటి మ్యాజిక్ ఏమీ జరుగలేదు.

Rajinikanths 2.0 China First weekend collections

రెండో రోజైన శుక్రవారం కేవలం $0.72 మిలియన్ మాత్రమే వసూలు చేసింది. ఆదివారం బిజినెస్ మరింత దిగజారింది. కేవలం $0.39 మిలియన్ మాత్రమే రాబట్టింది. దీంతో ఫస్ట్ వీకెండ్ టోటల్ $2.47 మిలియన్ రీచ్ అయింది. మన కరెన్సీ లెక్కల్లో చెప్పాలంటే ఈ మొత్తం రూ. 17 కోట్లు.

అయితే ఈ కలెక్షన్లు పరంగా చూసుకుంటే 2.0 మూవీ చైనాలో విడుదలైన బాహుబలి-ది బిగినింగ్ ఫస్ట్ వీకెండ్ వసూళ్లను అధిగమించింది. బాహుబలి-ది బిగినింగ్ ఫస్ట్ వీకెండ్ చైనాలో కేవలం $720,000 డాలర్లు మాత్రమే రాబట్టింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన 2.0 మూవీ గతేడాది ఇండియాలో రిలీజైంది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఎక్కువ బడ్జెట్ దాదాపు రూ. 570 కోట్లతో రూపొందిన ఈ చిత్రం ఇక్కడ అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X