2.0 మూవీ క్లోజింగ్ కలెక్షన్లు.. చరిత్ర సృష్టించిన శంకర్.. చైనాలో ప్రభంజనం..
వెండితెరపై దర్శకుడు శంకర్ సృష్టించిన మ్యాజిక్‌కు బ్రహ్మండమైన స్పందన కనిపించింది. అత్యుత్తమ టెక్నాలజీతో రూపొందిన 2.0 చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ చూరగొన్నది. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ నటించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రికార్డు కలెక్షన్లు సాధించింది. 2.0 క్లోజింగ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి...

అత్యున్నత సాంకేతిక టెక్నాలజీ
2.0 చిత్రం నేటివ్ త్రీడీ టెక్నాలజీతో రూపొందింది. భారతీయ సినిమా చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఈ చిత్రాన్ని రూ.550 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. హలీవుడ్ సినిమా సాంకేతిక నిపుణులు భారీగా పనిచేసిన సంగతి తెలిసిందే.

రూ.700 కోట్ల వసూళ్లు
2.0 చిత్రం తొలివారంలోనే భారీ రికార్డులు స్థాపించింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ డాలర్లు అంటే సుమారు 700 కోట్లకు పైగా రూపాయాలను బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టింది. ఈ సినిమా భారతీయ సినిమా స్టామినాకు అద్దంపట్టింది.

2.0 అరుదైన రికార్డు
ప్రపంచ సినీ చరిత్రలోనే 2.0 చిత్రం అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. వరల్డ్ వైడ్‌గా ఇప్పటివరకు 700 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన చిత్రాలు కేవలం 53 సినిమాలు మాత్రమే కావడం విశేషం. అలాంటి అరుదైన క్లబ్‌లో 2.0 చిత్రం చేరింది.

రికార్డు సృష్టించిన భారతీయ చిత్రాలు
భారతీయ సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు మాత్రమే ఈ ఘనతను సాధించాయి. అమీర్ ఖాన్ నటించిన పీకే, దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్, అలాగే బాహుబలి, ఇప్పుడు 2.0 చిత్రాలు ఈ జాబితాలోకి చేరాయి. ఇక ఈ సినిమా చైనాలో కూడా ప్రభంజనం సృష్టించడానికి రెడీగా ఉంది.

చైనాలో 56 వేల స్కీన్లలో
ఇప్పటి వరకు సృష్టించిన రికార్డుల అండతో 2.0 మూవీ మరో అరుదైన ఫీట్‌కు సిద్దమవుతున్నది. 2019 మే నెలలో ఈ చిత్రాన్ని చైనాలో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. రజనీకాంత్ నటించిన ఈ చిత్రాన్ని 56 వేల స్క్రీన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











