2.0 కలెక్షన్స్: చరణ్, మహేష్ రికార్డులను వెనక్కి నెట్టి టాప్ 4లోకి!
Recommended Video

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన విజువల్ వండర్ 2.0 చిత్రానికి యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ఫస్ట్ వీకెండ్ పలు రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్లింది.
యూఎస్ఏలో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో 2.0 చిత్రానికి 4వ స్థానం దక్కింది. ఫస్ట్ వీకెండ్ (4 డేస్)లోనే టాప్ 4 ప్లేస్ దక్కడం గమనార్హం. ఇప్పటి వరకు 2.0 అమెరికాలో ఎంత వసూలు చేసింది? బాహుబలిని కార్డులను అందుకునే అవకాశం ఉందా? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం....

యూఎస్ఏ ఫస్ట్ వీకెండ్ వసూళ్లు
2.0 చిత్రం ఆదివారం రాత్రి 9 గంటలకు వరకు నమోదైన వసూళ్ల వివరాల ప్రకారం..... ఇప్పటి వరకు $3.63 మిలియన్ డాలర్ వసూలు చేసింది. ఆదివారం 269 లొకేషన్లలో షోలు రన్ అవ్వగా... $628,290 రాబట్టింది.

రామ్ చరణ్, మహేష్ రికార్డులు బద్దలు
2.0 చిత్రం తొలి 4 రోజుల్లోనే $3.63 మిలియన్ రాబట్టడంతో ఇప్పటి వరకు రామ్ చరణ్ రంగస్థలం $3.5 మిలియన్, మహేష్ బాబు భరత్ అనే నేను $3.4 మిలియన్ రికార్డులను తుడిచిపెట్టినట్లయింది.

త్వరలో కబాలి రికార్డు బద్దలు
మరికొన్ని రోజుల్లో 2.0 చిత్రం కబాలి $4.5 మిలియన్ వసూళ్ల రికార్డును బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో యూఎస్ఏలో అత్యధిక వసూళ్లు సాధించిన రజనీకాంత్ చిత్రాల్లో 2.0 టాప్ పొజిషన్లో నిలవనుంది.

బాహుబలిరికార్డులను బద్దలు కొడుతుందా?
అయితే బాహుబలి 1, బాహుబలి 2 రికార్డులను 2.0 బద్దలు కొడుతుందా? లేదా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే బాహుబలి 2 నమోదు చేసిన $20.5 మిలియన్ రికార్డును బద్దలు కొట్టడం కష్టమే కానీ... బాహుబలి 1 రికార్డు(6.9 మిలియన్) లైఫ్ టైమ్ రన్‌లో బద్దలు కొట్టే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు.


Click it and Unblock the Notifications











