Darbar ఫస్ట్ డే కలెక్షన్స్: కుమ్మేసిన రజినీకాంత్.. బాక్సాఫీస్ దాడి షురూ

Recommended Video

#Darbar : Rajinikanth's Darbar Box Office Collections Day 1

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ 2020 సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. తన తాజా సినిమా 'దర్బార్' వసూళ్ల ప్రవాహం కురిపించి ఆ సినిమా నిర్మాతల్లో, అభిమానుల్లో నూతనోత్సాహం నింపారు. నిన్న (జనవరి 9) విడుదలైన 'దర్బార్' తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. దీంతో మొదటి రోజే అన్ని చోట్లా కుమ్మేస్తూ కాసుల వర్షం కురిపించింది. వివరాల్లోకి పోతే..

దర్బార్ హవా.. ఎక్కడ చూసిన రజినీ హంగామానే

దర్బార్ హవా.. ఎక్కడ చూసిన రజినీ హంగామానే

భారీ అంచనాల నడుమ విడుదలైన 'దర్బార్' సినిమా.. ఆ అంచనాలను రీచ్ అయ్యిందని మొదటి రోజు కలెక్షన్ రిపోర్ట్ చూస్తుంటే స్పష్టంగా తెలుస్తోంది.బ్యాడ్ పోలీస్ ఆఫీసర్‌గా రజినీకాంత్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన స్టైల్, మ్యానరిజం మిస్మరైజ్ చేశాయి. దీంతో ఎక్కడ చూసినా రజినీ హంగామానే కనిపించింది.

భారీ వసూళ్లపై కన్ను.. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజే

భారీ వసూళ్లపై కన్ను.. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజే

అందరూ ఊహించినట్లుగానే 'దర్బార్' సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. విడుదలైన అన్నిచోట్లా దర్బార్ జోష్ కనిపించింది. ఓవర్సీస్‌లో కూడా రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టడం విశేషం. ఫస్ట్ డే కలెక్షన్స్‌ని బట్టి చూస్తే రజినీకాంత్ భారీ వసూళ్లపై కన్నేశాడని తెలుస్తోంది. మొత్తంగా తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి.

వరల్డ్ వైడ్ రజినీ ఫ్యాన్స్‌కి కిక్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో

వరల్డ్ వైడ్ రజినీ ఫ్యాన్స్‌కి కిక్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో

ఒక్క తమిళనాడులోనే 35 కోట్ల ఓపెనింగ్ తెచ్చుకున్న దర్బార్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12 కోట్ల వరకు షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా మంచి దూసుకుపోయి సూపర్ వసూళ్లు తెచ్చింది దర్బార్. మొత్తానికి దర్బార్ ఫస్ట్ డే కలెక్షన్స్ వరల్డ్ వైడ్ రజినీ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చాయి.

ఆడియన్స్ రెస్పాన్స్.. రజినీ మాసివ్ రికార్డ్

ఆడియన్స్ రెస్పాన్స్.. రజినీ మాసివ్ రికార్డ్

మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు కొల్లగొట్టిన రజినీకాంత్.. ఆల్ టైమ్ రికార్డు సొంతం చేసుకున్నారు. తమిళనాడులో తొలి రోజే ఓ రేంజ్ కలెక్షన్స్ రాబట్టి ఆయన అభిమానులకు ముందుగానే పండగ తీసుకొచ్చారు. దీంతో యమ ఖుషీ అవుతున్న ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ రజినీకి కంగ్రాట్స్ చెబుతున్నారు.

 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్..

తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్..

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దర్బార్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 14.2 కోట్ల మేర జరిగింది. విడుదల తర్వాత 'దర్బార్' బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపు 15 కోట్లు రాబట్టాలి. ఈ నేపథ్యంలో తొలిరోజే 12 కోట్ల గ్రాస్ చేకూరింది కాబట్టి మరో రెండు మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

దర్బార్ సందడి.. బాక్సాఫీస్ దాడి

దర్బార్ సందడి.. బాక్సాఫీస్ దాడి

రజినీకాంత్ హీరోగా నటించిన 'దర్బార్' సినిమాకు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. భారీ హైప్ నడుమ తెరకెక్కిన ఈ చిత్రంలో రజినీకాంత్ జోడీగా నయనతార నటించింది. తొలి రోజు రిపోర్ట్ ప్రకారం చూస్తే రజినీకాంత్ బాక్సాఫీస్ దాడి మొదలైందని స్పష్టంగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X