కళ్లు చెదిరేలా 2.0 ప్రీ రిలీజ్ బిజినెస్.. రజనీ మాటలు నిజం కాబోతున్నాయా?
Recommended Video

భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన చిత్రం 2.0. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో సుమారు రూ.600 కోట్ల వ్యయంతో తెరకెక్కింది. భారతీయ సినిమా పరిశ్రమలో ఇంత మొత్తంలో రూపొందిన సినిమా ఇదే కావడం ఓ రికార్డు. అలాగే ఈ సినిమా విడుదలకు ముందే జరిగిన బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రోబో2.0 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి..

భారీ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్
కనివిని ఎరుగని బడ్జెట్ రూపొందిన 2.0 సినిమాకు డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో భారీగా బిజినెస్ జరిగింది. వివిధ హక్కుల ద్వారా ఈ సినిమా ఇప్పటికే రూ.370 కోట్ల రాబడి వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక రిలీజ్ తర్వాత కూడా భారీగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

శాటిలైట్, డిజిటల్ హక్కుల ద్వారా
ఇక ప్రాంతాల, ఇతర అంశాల వారీగా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి పరిశీలిస్తే.. శాటిలైట్ హక్కుల ద్వారా రూ.120 కోట్లు, డిజిటల్ హక్కుల ద్వారా రూ.60 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఉత్తరాదిలో సినిమా హక్కులను అడ్వాన్స్ ప్రాతిపదికన రూ.80 కోట్లకు అమ్మినట్టు సమాచారం.

ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో
దక్షిణాది రాష్ట్రాల్లో రోబో 2.0 సినిమా బిజినెస్ భారీగానే జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ హక్కులను రూ.70 కోట్లకు అమ్మినట్టు ఓ వార్త వెలుగులోకి వచ్చింది. కర్ణాటక హక్కులను రూ.25 కోట్లకు ఓ ప్రముఖ డిస్టిబ్యూటర్ హక్కులను సొంతం చేసుకొన్నట్టు ట్రేడ్ రిపోర్ట్.

శంకర్ వల్లనే ఇదంతా
ఇటీవల చెన్నైలో జరిగిన కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ.. సన్ పిక్చర్స్ అధినేత సుభాష్ కరన్, శంకర్‌కు కంగ్రాట్స్. ఈ సినిమా విజయాన్ని సుభాష్ కరన్‌కు ఇస్తాను. ఎందుకంటే రూ.600 కోట్లతో ఈ సినిమాను రూపొందించాడు. రజనీకాంత్, అక్షయ్ కుమార్, మరొకరినో నమ్మి ఈ సినిమా రూపొందించలేదు. కేవలం శంకర్ మీద నమ్మకంతోనే 2.0 సినిమాను ఆయన తీశాడు అని రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సూపర్ డూపర్ హిట్ అవ్వడం
రోబో 2.0 సినిమా అద్భుతంగా వచ్చింది. రిలీజ్ తర్వాత ఘన విజయం సాధిస్తుంది. బడ్జెట్ కంటే రెండు, మూడు వంతుల లాభం వస్తుంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని రజనీకాంత్ అన్నారు. అద్భుతమైన టెక్నాలజీతో 2.0 సినిమా రూపొందింది అని రజనీ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











