twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాలా కలెక్షన్లు షాకింగ్.. అదే వసూళ్లను దెబ్బ తీసిందా?

    By Rajababu
    |

    సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కాలా చిత్రం ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదలైంది. రజనీ కెరీర్‌లోనే ముందెన్నడూ లేని విధంగా తొలి రోజు కలెక్షన్లు నిరాశజనకంగా నమోదయ్యాయి. అయితే రెండో రోజున కాలా వసూళ్లు పుంజుకోవడం కొంత ఊరట లభించింది. రజనీకాంత్, నానా పాటేకర్, హ్యుమా ఖురేషి, ఈశ్వరీరావు నటించిన చిత్రం తొలి ఆట నుంచే మిశ్రమ స్పందన వ్యక్తమైంది.

    యూఎస్‌, ఆస్ట్రేలియాలో వసూళ్లు

    యూఎస్‌, ఆస్ట్రేలియాలో వసూళ్లు

    కాలా రిలీజ్ డేట్ కంటే ఒకరోజు ముందుగానే (జూన్ 6న) అమెరికాలో ప్రీమియర్లు ప్రదర్శించారు. యూఎస్‌లో ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ సాధించింది. గత రెండు రోజుల్లో మిలియన్ డాలర్ల కలెక్షన్ల (6.7 కోట్లు)ను సాధించడం గమనార్హం. గతంలో రజనీ నటించిన రోబో, కబాలీ చిత్రాలు కూడా ఈ ఘనతను సాధించాయి. ఆస్ట్రేలియాలో గురు, శుక్రవారాల్లో సుమారు 1.06 కోట్లు వసూలు చేయడం గమనార్హం.

    కర్ణాటకలో మంచి రెస్పాన్స్

    కర్ణాటకలో మంచి రెస్పాన్స్

    కర్ణాటకలో కాలా చిత్ర రిలీజ్‌కు కావేరి జలాల వివాదం అడ్డుపడింది. నిషేధాలు, నిరసనల మధ్య విడుదలైన కాలా చిత్రం సుమారు రూ.10 కోట్లు వసూలు చేసింది. నిషేధం ఎత్తివేత తర్వాత కాలా చిత్రం కన్నడలో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నది. రెండో రోజున విడుదలైన ఈ చిత్రం 1.44 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం.

     తమిళనాడులో భారీ ఒపెనింగ్స్

    తమిళనాడులో భారీ ఒపెనింగ్స్

    తమిళనాడులో కాలా చిత్రానికి మంచి ఒపెన్సింగ్ లభించాయి. సుమారు 600 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం స్థూలంగా రూ.15 కోట్లు నికరంగా 11 కోట్లు (జీఎస్టీ, స్థానిక పన్నుల తర్వాత) వసూలు చేసింది. చెన్నైలోని ఈ చిత్రం తొలిరోజున 1.78 కోట్లు వసూలు చేసి రికార్డు నెలకొల్పింది.

     తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు

    తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు

    కాలా చిత్రం మొదటి రోజున తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లో మంచి వసూళ్లను సాధించింది. రెండు రాష్ట్రాల్లో కలిపి 3.14 కోట్ల షేర్ సాధించింది. నైజాంలో రూ.1.16 కోట్లు, సీడెడ్‌లో రూ.45 లక్షలు, ఉత్తరాంధ్రలో 30.6 లక్షలు, గుంటూరులో రూ.40 లక్షలు, తూర్పు గోదావరిలో 24.25 లక్షలు, కృష్ణాలో 26 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 20 లక్షలు, నెల్లూరులో 12.35 లక్షల వసూలు చేసింది.

     పబ్లిసిటీ లేకపోవడమే దెబ్బ

    పబ్లిసిటీ లేకపోవడమే దెబ్బ

    కబాలి తర్వాత పా రంజిత్, రజనీకాంత్ కాంబినేషన్ వచ్చిన కాలా చిత్రం విడుదలకు ముందే రూ.200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అయితే కబాలితో పోల్చుకుంటే కాలాకు తక్కువ పబ్లిసిటీ చేసి విడుదల చేయడం వల్ల రికార్డుస్థాయి ఓపెనింగ్స్ సాధించలేదనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

    English summary
    The first-day box office collection of Kaala set the record for the lowest-ever box office opening for a Rajinikanth film. However, the film seems to have picked up momentum on its second day worldwide. According to reports, the film has touched 1 million-mark in the US, and has collected about Rs 6.7 crore in the country.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X