వందకోట్ల క్లబ్‌లో కాలా.. చెన్నైలో రికార్డు సృష్టించిన రజనీ!
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కాలా చిత్రం మిశ్రమ స్పందన సంపాదించుకొన్నప్పటికీ ఓ మోస్తారు కలెక్షన్లు సాధిస్తున్నది. కబాలి తర్వాత దర్శకుడు, పా రంజిత్, రజనీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన కాలా చిత్రం జూన్ 7వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. సమాజంలోని భూ చట్టాలు, అసమానత్వం లాంటి అంశాలతో తెరకెక్కిన కాలా కొన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకొంటున్నది.
Recommended Video


రజనీకి రెండో అతిపెద్ద
దక్షిణాదిలో కాలా చిత్రం రజనీకాంత్‌కు రెండో అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. కబాలి ఓపెనింగ్స్ ఇప్పటికీ అత్యుత్తమంగా నిలిచాయి. మిగితా రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన కనిపిస్తుండగా, తమిళనాడులో మాత్రం భారీ కలెక్షన్లపరంగా దూసుకెళ్తున్నది.

వంద కోట్ల క్లబ్‌లో
ప్రపంచవాప్తంగా విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. అమెరికాలో ఈ చిత్రం శనివారానికే మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకొన్నది. ఆస్ట్రేలియాలోనూ ఈ చిత్రం కోటికిపైగా కలెక్షన్లను సాధించింది. అలాగే దుబాయ్‌లోనూ మంచి కలెక్షన్లను సాధిస్తున్నది.

చెన్నైలో కాలా జోరు
కాలా చిత్రం తమిళనాటు బ్రహ్మండమైన వసూళ్లను సాధిస్తున్నది. కేవలం చెన్నైలో నాలుగు రోజుల్లో రూ.6.64 కోట్లు సాధించింది. తొలి రోజున 1.76 కోట్లు, రెండో రోజున రూ.1.44 కోట్లు, మూడో రోజున రూ.1.7 కోట్లు, నాలుగు రోజున రూ.1.74 కోట్లు కలెక్షన్లను సాధించింది. తమిళ సినీ చరిత్రలో ఇది ఓ రికార్డుగా చెప్పవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో
తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున నైజాం, ఏపీలో మంచి కలెక్షన్లను సాధించింది. నైజంలో రూ.1.3 కోట్లు, ఏపీలో రూ.2 కోట్లు సాధించిన ఈ చిత్రం రెండో రోజు నుంచి కలెక్షన్లు కాస్తా తగ్గాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

230 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్
కాలా చిత్రం రిలీజ్‌కు ముందే రూ.230 కోట్ల బిజినెస్ చేసింది. థియేట్రికల్ హక్కుల ద్వారా రూ.155 కోట్లు, ప్రసాదర హక్కుల ద్వారా 70 కోట్లు, మ్యూజిక్ హక్కుల ద్వారా రూ.5 కోట్లు సొంతం చేసుకొన్నది.

కార్తీక్ సుబ్బరాజుతో రజనీ సినిమా
కాలా రిలీజ్ రోజే రజనీకాంత్ మరో చిత్రాన్ని పట్టాలెక్కించారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సినిమాను చెన్నైలో ప్రారంభించారు. రజనీ రాజకీయాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని వచ్చే ఎన్నికల ముందే రిలీజ్ చేసే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు.


Click it and Unblock the Notifications











