‘కాలా’ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 230 కోట్లు.... (ఏరియా వైజ్)

By Bojja Kumar

Recommended Video

Kaala Pre -Release Business Creates Wonders

రజనీకాంత్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాలా' చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. సూపర్ స్టార్ గత చిత్రాల కంటే ఎక్కువగా ఈ సారి బిజినెస్ జరుగడం విశేషం. అయితే 'కబాలి'తో పోలిస్తే చాలా చోట్ల 'కాలా' థియేట్రికల్ రైట్స్ తక్కువ రేటుకే అమ్ముడయ్యాయి. కానీ శాటిలైట్ రైట్స్ రూపంలో కలిసి రావడంతో ఓవరాల్‌గా 'కాలా' టాప్‌లో నిలిచింది. కబాలి అప్పట్లో మొత్తం కలిపి రూ. 218 కోట్ల బిజినెస్ చేయగా, 'కాలా' దాన్ని అధిగమిస్తూ రూ. 230 కోట్లు మార్కును అందుకుంది. జూన్ 7న 'కాలా' విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

 తమిళనాడులో పరిస్థితి ఇదీ...

తమిళనాడులో పరిస్థితి ఇదీ...

తమిళనాడులో రూ. 60 కోట్లకు ‘కాలా' డిస్ట్రిబ్యూషన్స్ రైట్స్ అమ్ముడయ్యాయి. అయితే ‘కబాలి'(రూ. 68 కోట్లు) కంటే ఇది తక్కువే. రెస్టాఫ్ ఇండియాలో కూడా గతంలో ‘కబాలి' రూ. 10 కోట్లకు అమ్ముడవ్వగా, ఈ సారి ‘కాలా'కు రూ. 7 కోట్లు మాత్రమే వచ్చాయి.

తెలుగు, మలయాళం ఎక్కువగా

తెలుగు, మలయాళం ఎక్కువగా

కబాలి తెలుగు(ఏపీ-తెలంగాణ) రైట్స్ రూ. 32 కోట్లకు అమ్ముడవ్వగా.... ఈ సారి ‘కాలా ' రూ. 33 కోట్లు వచ్చాయి. కేరళలో ‘కబాలి' రికార్డు(రూ. 7.5 కోట్ల)ను బద్దలు కొడుతూ రూ. 10 కోట్లకు అమ్ముడైంది. అయితే కర్నాటకలో కావేరి వివాదంకారణంగా ‘కాలా' రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. గతంలో కర్నాటకలో కబాలి రూ. 10 కోట్లకు అమ్ముడైంది.

ఓవర్సీస్‌లో మంచి డిమాండ్

ఓవర్సీస్‌లో మంచి డిమాండ్

ఓవర్సీస్ మార్కెట్లో ‘కబాలి' కంటే ‘కాలా' రూ. 10 కోట్లు అదనంగా రాబట్టి మొత్తం రూ. 45 కోట్ల బిజినెస్ చేసింది. యూఎస్ఏతో పాటు మలేషియా, జపాన్, సింగపూర్ దేశాల్లో రజనీ సినిమాలకు మంచి డిమాండ్ ఉండటమే ఇందుకు కారణం.

ఊహించని స్థాయిలో శాటిలైట్ రైట్స్

ఊహించని స్థాయిలో శాటిలైట్ రైట్స్

అన్నికంటే ముఖ్యంగా ‘కాలా'కు శాటిలైట్ రైట్స్ రూపంలో బాగా కలిసొచ్చింది. ‘కబాలి' చిత్రానికి అప్పట్లో రూ. 40 కోట్లు రాగా, ఈ సారి ‘కాలా'కు ఏకంగా రూ. 70 కోట్ల వచ్చాయి. ఆడియో రైట్స్ రూపంలో మరో రూ. 5 కోట్లు సమకూరాయి.

 ఓవరాల్ బిజినెస్ డిటేల్స్

ఓవరాల్ బిజినెస్ డిటేల్స్

‘కాలా' ఓవరాల్ బిజినెస్ రూ. 230 కోట్లలో .... థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ. 155 కోట్లు, శాటిలైట్ రైట్స్ ద్వారా రూ. 70 కోట్లు, ఆడియో రైట్స్ రూ. 5 కోట్ల బిజినెస్ జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X