Jailer 10 Days Collections: వీకెండ్ ఆగయా.. దేఖో జైలర్ కా షో.. రూ.500 కోట్లకు చేరువలో!
సూపర్ స్టార్ రజినీ కాంత్.. బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్నారు. ఇక రజినీ స్టామినా ఏంటో ఈ సినిమా చూపిస్తోంది. ఇక వీకెండ్ రావడంతో.. జైలర్ సినిమాకు కలెక్షన్స్ మరింత పెరిగాయి. 9వ రోజు కంటే... ఈ మూవీ 10వ రోజు సాలిడ్ కలెక్షన్స్ సాధించి.. రూ.500 కోట్లకు చేరువకు చేరుకుంది. జైలర్ మూవీ పది రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్ రిపోర్టు ఎలా ఉందో ఈ స్టోరీలో చూద్దాం.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. ఇక ఈ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రజినీ సరసన రమ్య కృష్ణ నటించి మెప్పించింది. హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది. అంతే కాదు ఈ సినిమాలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ అతిథి పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ఈ మూవీకి అనిరుద్ అందించిన సంగీతం మాత్రం వీర లెవెల్ లో ఆకట్టుకుంటోంది.

'జైలర్' మూవీపై విడుదలకు ముందే హైప్ ఏర్పడి... ఈ సినిమా హక్కులకు వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తమిళనాడులో రూ. 62 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు, కర్నాటకలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో రూ. 122.50 కోట్లు బిజినెస్ అయింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో జైలర్ మూవీ విషయానికి వస్తే... సాలిడ్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. 9వ రోజు కంటే.. 10రోజు వీకెండ్ కావడంతో.. మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా 10వ రోజు 2 కోట్లకు పైగా షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో 4.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుందని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి.

జైలర్ సినిమా 10 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ చూస్తే.. నైజాం రూ.17.57 కోట్లు, సెడెడ్ రూ.4.93కోట్లు, ఉత్తరాంధ్ర రూ.4.80 కోట్లు, తూర్పు రూ.2.44 కోట్లు, పశ్చిమ రూ.1.42 కోట్లు, గుంటూరు రూ. 2.56 కోట్లు, కృష్ణ రూ.2.25 కోట్లు, నెల్లూరు రూ.1.12 కోట్లు వసూలు చేయగా... తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 10 రోజుల్లో రూ.37.09 షేర్ రాబట్టగా... రూ.63.25 గ్రాస్ వసూలు చేసింది.
ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి రాగా... 24.09 కోట్ల లాభాలు సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది. ఇక సినిమా 10వ రోజు వరల్డ్ వైడ్ గా 24.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.

ఇక జైలర్ సినిమా మొత్తంగా వరల్డ్ వైడ్ 10 రోజుల కలెక్షన్స్ గమనిస్తే... తమిళనాడులో రూ.141.15 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. రూ.63.30( తమిళ వెర్షన్ కలిపుకుని), కర్ణాటకలో రూ. 54.10 కోట్లు, కేరళలో రూ.41.85 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.10.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ.163 కోట్లు వసూలు చేసింది. మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్లు 474 గ్రాస్ కలెక్ట్ చేయగా... రూ. 231.95 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 474 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది. ఇక రూ.124 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 107.95 కోట్ల రేంజ్ లో లాభాల్లో ముందుకు వెళ్తోంది.


Click it and Unblock the Notifications











