Jailer 11 Days Collections: 500 కోట్లతో సంచలనం.. లాభాలతో జైలర్ రికార్డు.. కొత్త టార్గెట్ బాహుబలి
విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాలో తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇదే ఊపును ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తూ వరుస చిత్రాలతో సందడి చేస్తున్నారు. కానీ, ఈ మధ్య ఆయనకు విజయమే దక్కలేదు. ఈ పరిస్థితుల్లోనే ఇటీవలే తలైవా 'జైలర్' అనే సినిమాను చేశారు. ఈ మూవీకి ఆరంభం నుంచే భారీ స్పందన వస్తోంది. ఇలా 2 వారంలోనూ ఇది దూసుకెళ్తోంది. దీంతో కలెక్షన్లు బాగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'జైలర్' 11 రోజుల రిపోర్టును మీరే చూడండి!
జైలర్‌గా రజినీకాంత్ ఊచకోత:రజినీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'జైలర్'. నెల్సన్ దిలీప్ కుమార్ తీసిన ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేయగా.. తమన్నా హీరోయిన్‌గా నటించింది. దీనికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ చేశాడు. ఇందులో సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబులు కీలక పాత్రలను పోషించారు.

జైలర్ మూవీకి బిజినెస్ ఇలా: 'జైలర్' మూవీపై ఆరంభం నుంచీ అంచనాలు భారీగా ఉండడంతో ఈ సినిమా హక్కులకు వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తమిళనాడులో రూ. 62 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు, కర్నాటకలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో రూ. 122.50 కోట్లు బిజినెస్ జరిగింది.11వ
రోజు తెలుగులో వసూళ్లు: 'జైలర్' మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 11వ రోజు రచ్చ లేపేసింది. ఫలితంగా నైజాంలో రూ. 1.67 కోట్లు, సీడెడ్‌లో రూ. 42 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 39 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 22 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, గుంటూరులో రూ. 20 లక్షలు, కృష్ణాలో రూ. 18 లక్షలు, నెల్లూరులో రూ. 9 లక్షలతో.. రూ. 3.28 కోట్లు షేర్, రూ. 5.30 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
11 రోజులకు కలిపి ఎంతంటే: 11 రోజుల్లో 'జైలర్' ఏపీ, తెలంగాణలో సంచలన స్పందనను అందుకుంది. ఫలితంగా నైజాంలో రూ. 19.24 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.35 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.19 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.66 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.53 కోట్లు, గుంటూరులో రూ. 2.76 కోట్లు, కృష్ణాలో రూ.2.43 కోట్లు, నెల్లూరులో రూ. 1.21 కోట్లతో.. రూ. 40.37 కోట్లు షేర్, రూ. 68.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

తెలుగులో ఎన్ని కోట్ల లాభం: యాక్షన్ జోనర్‌లో వచ్చిన 'జైలర్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తద్వారా ఈ చిత్రం రూ. 13 కోట్లు మేర బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, ఈ మూవీ 11 రోజుల్లోనే రూ. 40.37 కోట్లు రాబట్టింది. ఫలితంగా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 27.37 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుని సత్తా చాటింది.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు: 'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. దీంతో 11 రోజుల్లో తెలుగులో రూ. 68.60 కోట్లు (తమిళ వెర్షన్ కలిపి), తమిళంలో రూ. 148.80 కోట్లు, కర్నాటకలో రూ. 58.80 కోట్లు, కేరళలో రూ. 45.90 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 11.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 168.40 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 502.40 కోట్లు గ్రాస్, రూ. 246 కోట్లు షేర్ వచ్చింది.

ఓవరాల్‌గా లాభం ఎంతంటే: 'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 122.50 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. దీంతో ఇది రూ. 124 కోట్లు షేర్ టార్గెట్‌తో ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చింది. ఇక, ఈ చిత్రం 11 రోజుల్లో రూ. 246.00 కోట్లు రాబట్టింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 122 కోట్లు లాభాలను అందుకుంది. ఇక, ఈ చిత్రం PS 1 కలెక్షన్లను దాటి.. బాహుబలి 1 వసూళ్లను టార్గెట్ చేసింది.


Click it and Unblock the Notifications











