Jailer 12 Days Collections: వర్కింగ్ డేలోనూ దుమ్మురేపుతోన్న జైలర్... ఎన్ని కోట్ల లాభాలో తెలిస్తే షాకే?

సూపర్ స్టార్ రజినీ కాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద దండయాత్ర చేస్తున్నారు. ఆయన తాజాగా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం... బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక రిటైర్డ్ అయిపోవాలంటూ కామెంట్స్ చేసినవారికి రజినీ ఈ సినిమాతో సరైన సమాధానం చెప్పారు. వర్కింగ్ డేస్ లోనూ ఈ మూవీ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక 12వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

తలైవా రజినీకాంత్ జైలర్ సినిమాతో ప్రభంజనం చూపిస్తున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాతో ఊచకోత కోస్తున్నారు. ఇక ఈ మూవీలో రిటైర్ట్ పోలీస్ ఆఫీసర్ గా రజినీ కనిపించి.. ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈయనకు జోడీగా రమ్యకృష్ణ నటించింది. తమన్నా హీరోయిన్ గా నటించగా... మోహన్ లాల్, శివ రాజ్ కుమార్,సునీల్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించారు.

 Jailer 12 Days Collections

ఇక రజినీ మూవీ జైలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లోనూ మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. తర్వాత తిరిగి వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా మరోసారి మంచి కలెక్షన్స్ తో జోరు చూపిస్తోంది. సినిమా 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. సినిమా కోటి నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని రాబట్టుగా... సినిమా మొత్తం మీద ఇప్పుడు 1.02 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

 Jailer 12 Days Collections

జైలర్ సినిమా 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే...నైజాం రూ.19.70కోట్లు, సెడెడ్ రూ.5.48కోట్లు, ఉత్తరాంధ్ర రూ.5.32 కోట్లు, తూర్పు రూ.2.75 కోట్లు, పశ్చిమ రూ.1.58 కోట్లు, గుంటూరు రూ.2.83 కోట్లు, కృష్ణ రూ.2.49 కోట్లు, నెల్లూరు రూ.1.24 కోట్లు వసూలు చేయగా... తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 12 రోజుల్లో రూ. 41.39 షేర్ రాబట్టగా... రూ.70.20 గ్రాస్ వసూలు చేసింది.

ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి రాగా... 28.39 కోట్ల లాభాలు సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది. ఇక సినిమా 12వ రోజు వరల్డ్ వైడ్ గా 12.60 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది.

 Jailer 12 Days Collections

ఇక జైలర్ సినిమా మొత్తంగా వరల్డ్ వైడ్ 12 రోజుల కలెక్షన్స్ గమనిస్తే... తమిళనాడులో రూ.152.20కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. రూ.71.25( తమిళ వెర్షన్ కలిపుకుని), కర్ణాటకలో రూ. 60.55 కోట్లు, కేరళలో రూ. 47.45 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.12.65 కోట్లు, ఓవర్సీస్ లో రూ.173.90 కోట్లు వసూలు చేసింది. మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్లు 518 గ్రాస్ కలెక్ట్ చేయగా... రూ. 253.55 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 518 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది. ఇక రూ.124 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 129.55 కోట్ల రేంజ్ లో లాభాల్లో ముందుకు వెళ్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X