Jailer 13 Days Collections: తలైవాకు తొలి షాక్.. వందల కోట్లు ఔట్.. ఆ సినిమాల బడ్జెట్ అంత లాభాలా!
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా భాష, ప్రాంతంతో ఏమాత్రం సంబంధం లేకుండా సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. అయితే, కొంత కాలంగా ఆయన భారీ విజయాలను మాత్రం దక్కించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే రెండు వారాల క్రితమే తలైవా 'జైలర్' అనే సినిమాతో వచ్చారు. దీనికి ఆరంభం నుంచీ అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా అప్పటి నుంచీ కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో 'జైలర్' 13 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!
జైలర్‌గా ఎంట్రీ ఇచ్చిన తలైవా:తలైవా రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన సినిమానే 'జైలర్'. తీసిన ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో రమ్యకృష్ణ, మిర్నా మీనన్, వినాయకన్, వసంత్ రవి ప్రధాన పాత్రలను చేశారు. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని ఇచ్చాడు. ఇందులో తమన్నా, సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబులు కీలక పాత్రలు చేశారు.

జైలర్ మూవీకి బిజినెస్ ఇలా:ఆరంభం నుంచీ 'జైలర్' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా హక్కులకు వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తమిళనాడులో రూ. 62 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు, కర్నాటకలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో రూ. 122.50 కోట్లు బిజినెస్ అయింది.
13వ రోజు తెలుగులో వసూళ్లు:'జైలర్' మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 13వ రోజు బాగా డౌన్ అయింది. ఫలితంగా నైజాంలో రూ. 31 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రూ. 75 లక్షలు షేర్, రూ. 1.20 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

13 రోజులకు కలిపి ఎంతంటే:'జైలర్' 13 రోజుల్లో ఏపీ, తెలంగాణలో సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంది. ఫలితంగా నైజాంలో రూ. 20.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.58 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.43 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.83 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.62 కోట్లు, గుంటూరులో రూ. 2.88 కోట్లు, కృష్ణాలో రూ. 2.53 కోట్లు, నెల్లూరులో రూ. 1.26 కోట్లతో.. రూ. 42.14 కోట్లు షేర్, రూ. 71.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

తెలుగులో ఎన్ని కోట్ల లాభం:క్రేజీ స్టోరీతో రూపొందిన 'జైలర్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తద్వారా ఈ చిత్రం రూ. 13 కోట్లు మేర బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, ఈ మూవీ 13 రోజుల్లోనే రూ. 42.14 కోట్లు రాబట్టింది. ఫలితంగా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 29.14 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుని సత్తా చాటింది.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు:'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. దీంతో 13 రోజుల్లో తెలుగులో రూ. 72.45 కోట్లు (తమిళ వెర్షన్ కలిపి), తమిళంలో రూ. 155.05 కోట్లు, కర్నాటకలో రూ. 61.65 కోట్లు, కేరళలో రూ. 48.10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 13.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 177.40 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 527.80 కోట్లు గ్రాస్, రూ. 258.30 కోట్లు షేర్ వచ్చింది.

ఓవరాల్‌గా లాభం ఎంతంటే:సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 122.50 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. దీంతో ఇది రూ. 124 కోట్లు షేర్ టార్గెట్‌తో ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చింది. ఇక, ఈ చిత్రం 13 రోజుల్లో రూ. 258.30 కోట్లు రాబట్టింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 134.30 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











