Jailer 15 Days Collections: రజినీకి మరో దెబ్బ.. కానీ అన్ని వందల కోట్లు ఔట్.. డబుల్ లాభాలతో చరిత్ర
విలక్షణమైన నటనా శైలితో విభిన్నమైన సినిమాలు చేస్తూ సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం నెమ్మదించని ఆయన.. ఏకధాటిగా సినిమాలు చేస్తున్నారు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం భారీ సక్సెస్‌ను సాధించలేదు. ఈ పరిస్థితుల్లోనే ఇటీవలే రజినీకాంత్ 'జైలర్' అనే సినిమాను చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు అదిరిపోయే రెస్పాన్స్‌ను అందించారు. ఫలితంగా ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. మరి ఆలస్యం లేకుండా 'జైలర్' 15 రోజుల రిపోర్టును చూద్దామా!
జైలర్‌గా వచ్చేసిన రజినీకాంత్:తలైవా రజినీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే 'జైలర్'. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో రమ్యకృష్ణ, మిర్నా మీనన్, వినాయకన్, వసంత్ రవి ప్రధాన పాత్రలను చేయగా.. తమన్నా, సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని ఇచ్చాడు.

జైలర్ మూవీకి బిజినెస్ ఇలా:క్రేజీ కాంబోలో కావడంతో 'జైలర్' మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా హక్కులకు వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తమిళనాడులో రూ. 62 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు, కర్నాటకలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో రూ. 122.50 కోట్లు బిజినెస్ అయింది.

15వ రోజు తెలుగులో వసూళ్లు:
15వ రోజు 'జైలర్' మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరింత పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 15 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 31 లక్షలు షేర్, రూ. 55 లక్షలు గ్రాస్ వసూలు అయింది.
15 రోజులకు కలిపి ఎంతంటే: 'జైలర్' ఏపీ, తెలంగాణలో 15 రోజుల్లో భారీ స్పందన అందుకుంది. ఫలితంగా నైజాంలో రూ. 20.37 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.67 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.54 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.91 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.65 కోట్లు, గుంటూరులో రూ. 2.94 కోట్లు, కృష్ణాలో రూ. 2.58 కోట్లు, నెల్లూరులో రూ. 1.28 కోట్లతో.. రూ. 42.94 కోట్లు షేర్, రూ. 72.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

తెలుగులో ఎన్ని కోట్ల లాభం: క్రేజీ కాంబోలో రూపొందిన 'జైలర్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తద్వారా ఈ చిత్రం రూ. 13 కోట్లు మేర బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, ఈ మూవీ 15 రోజుల్లోనే రూ. 42.94 కోట్లు రాబట్టింది. ఫలితంగా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 29.94 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుని సత్తా చాటింది.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు: 'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రాణించింది. దీంతో 15 రోజుల్లో తెలుగులో రూ. 73.75 కోట్లు (తమిళ వెర్షన్ కలిపి), తమిళంలో రూ. 159.55 కోట్లు, కర్నాటకలో రూ. 63.25 కోట్లు, కేరళలో రూ. 49.00 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 13.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 181.10 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 540.60 కోట్లు గ్రాస్, రూ. 264.40 కోట్లు షేర్ వచ్చింది.

ఓవరాల్‌గా లాభం ఎంతంటే: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన 'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 122.50 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. దీంతో ఇది రూ. 124 కోట్లు షేర్ టార్గెట్‌తో ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చింది. ఇక, ఈ చిత్రం 15 రోజుల్లో రూ. 264.40 కోట్లు రాబట్టింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 140.40 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











