Jailer 16 Days Collections: తెలుగులో చరిత్ర సృష్టించిన తలైవా.. 16 రోజుల్లోనే అన్ని కోట్లతో రికార్డు
దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఇండియన్ సినిమాపై ప్రభావాన్ని చూపిస్తూ ఇప్పటికీ తన రేంజ్‌ను పెంచుకుంటూనే వెళ్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. అయితే, కొంత కాలంగా ఆయన ఒక్క హిట్‌ను కూడా ఖాతాలో వేసుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లోనే రెండు వారాల క్రితమే 'జైలర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
దీనికి అన్ని వర్గాల నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది. ఫలితంగా వసూళ్లు పోటెత్తి కొన్ని కోట్ల లాభాలు కూడా దక్కాయి. దీంతో ఎన్నో రికార్డులూ బద్దలయ్యాయి. మరి 'జైలర్' మూవీ 16 రోజుల రిపోర్టు చూద్దామా!

జైలర్‌గా రజినీకాంత్ సందడి: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రమే 'జైలర్'. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో రమ్యకృష్ణ, మిర్నా మీనన్, వినాయకన్, వసంత్ రవి ప్రధాన పాత్రలను చేయగా.. తమన్నా, సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబులు కీలక పాత్రల్లో కనిపించారు. దీనికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఇచ్చాడు.

జైలర్ మూవీకి బిజినెస్ ఇలా: యాక్షన్ జోనర్‌లో వచ్చిన 'జైలర్' మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా హక్కులకు వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తమిళనాడులో రూ. 62 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు, కర్నాటకలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో రూ. 122.50 కోట్లు బిజినెస్ జరిగింది.

16వ రోజు తెలుగులో వసూళ్లు: 'జైలర్' మూవీ 16వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మళ్లీ సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 20 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 42 లక్షలు షేర్, రూ. 75 లక్షలు గ్రాస్ వసూలు అయింది.
16 రోజులకు కలిపి ఎంతంటే: 16 రోజుల్లో 'జైలర్' ఏపీ, తెలంగాణలో భారీ స్పందన అందుకుంది. ఫలితంగా నైజాంలో రూ. 20.57 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.71 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.59 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.95 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.67 కోట్లు, గుంటూరులో రూ. 2.97 కోట్లు, కృష్ణాలో రూ. 2.61 కోట్లు, నెల్లూరులో రూ. 1.29 కోట్లతో.. రూ. 43.36 కోట్లు షేర్, రూ. 73.50 కోట్లు గ్రాస్ వచ్చింది.
తెలుగులో ఎన్ని కోట్ల లాభం: యాక్షన్ జోనర్‌లో వచ్చిన 'జైలర్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తద్వారా ఈ చిత్రం రూ. 13 కోట్లు మేర బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, ఈ మూవీ 16 రోజుల్లోనే రూ. 43.36 కోట్లు రాబట్టింది. ఫలితంగా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 30.36 కోట్లు లాభాలను అందుకుని చరిత్రను సృష్టించింది.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు: 'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రాణించింది. దీంతో 16 రోజుల్లో తెలుగులో రూ. 74.55 కోట్లు (తమిళ వెర్షన్ కలిపి), తమిళంలో రూ. 162.05 కోట్లు, కర్నాటకలో రూ. 64.10 కోట్లు, కేరళలో రూ. 49.80 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 14.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 182.55 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 547.25 కోట్లు గ్రాస్, రూ. 267.60 కోట్లు షేర్ వచ్చింది.
ఓవరాల్‌గా లాభం ఎంతంటే: తలైవా రజినీకాంత్ హీరోగా నటించిన 'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 122.50 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. దీంతో ఇది రూ. 124 కోట్లు షేర్ టార్గెట్‌తో ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చింది. ఇక, ఈ చిత్రం 16 రోజుల్లో రూ. 267.60 కోట్లు రాబట్టింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 143.60 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











