Jailer 17 Days Collections: తలైవా మాస్ బ్యాటింగ్.. అన్ని వందల కోట్లు ఉఫ్.. కళ్లు చెదిరే లాభాలతో!
ఇండియన్ సినిమాపై ఇప్పుడున్న సీనియర్లలో చాలా మంది స్టార్ హీరోలు ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నారు. అందులో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా తనదైన సినిమాలతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఆయన.. ఇప్పటికీ అదే ఊపుతో దూసుకుపోతోన్నారు.
ఈ క్రమంలోనే ఇటీవలే తలైవా 'జైలర్' అనే సినిమాతో వచ్చారు. దీనికి ఆరంభం నుంచే భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇలా 'జైలర్' మూవీ 17 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే కూడా చూసేయండి!

జైలర్‌గా రజినీకాంత్ అరాచకం: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తీసిన యాక్షన్ మూవీనే 'జైలర్'. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో రమ్యకృష్ణ, మిర్నా మీనన్, వినాయకన్, వసంత్ రవి ప్రధాన పాత్రలను చేయగా.. తమన్నా, సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబులు కీలక పాత్రల్లో కనిపించారు. దీనికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు.

జైలర్ మూవీకి బిజినెస్ ఇలా: క్రేజీ కాంబోలో రూపొందిన 'జైలర్' మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా హక్కులకు వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తమిళనాడులో రూ. 62 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు, కర్నాటకలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో రూ. 122.50 కోట్లు బిజినెస్ అయింది.

17వ రోజు తెలుగులో వసూళ్లు: 17వ రోజు 'జైలర్' మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అదరగొట్టేసింది. ఫలితంగా నైజాంలో రూ. 28 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రూ. 53 లక్షలు షేర్, రూ. 1.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

17 రోజులకు కలిపి ఎంతంటే: 'జైలర్' ఏపీ, తెలంగాణలో 17 రోజుల్లో భారీ స్పందన అందుకుంది. ఫలితంగా నైజాంలో రూ. 20.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.77 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.64 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.99 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.69 కోట్లు, గుంటూరులో రూ. 3.00 కోట్లు, కృష్ణాలో రూ. 2.64 కోట్లు, నెల్లూరులో రూ. 1.31 కోట్లతో.. రూ. 43.89 కోట్లు షేర్, రూ. 74.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

తెలుగులో ఎన్ని కోట్ల లాభం: యాంకర్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'జైలర్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తద్వారా ఈ చిత్రం రూ. 13 కోట్లు మేర బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, ఈ మూవీ 17 రోజుల్లోనే రూ. 43.89 కోట్లు రాబట్టింది. ఫలితంగా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 30.89 కోట్లు లాభాలను అందుకుని సరికొత్త రికార్డును నమోదు చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు: 'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. దీంతో 17 రోజుల్లో తెలుగులో రూ. 75.60 కోట్లు (తమిళ వెర్షన్ కలిపి), తమిళంలో రూ. 166.85 కోట్లు, కర్నాటకలో రూ. 65.05 కోట్లు, కేరళలో రూ. 50.35 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 14.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 185.30 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 557.70 కోట్లు గ్రాస్, రూ. 272.75 కోట్లు షేర్ వచ్చింది.

ఓవరాల్‌గా లాభం ఎంతంటే: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన 'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 122.50 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. దీంతో ఇది రూ. 124 కోట్లు షేర్ టార్గెట్‌తో ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చింది. ఇక, ఈ చిత్రం 17 రోజుల్లో రూ. 272.75 కోట్లు రాబట్టింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 148.75 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











