Jailer 18 Days Collections: సండే పెను సంచలనం.. ఇండస్ట్రీ రికార్డు బద్దలు.. వామ్మో అన్ని కోట్ల లాభమా!
సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరుకు అస్సలు పరిచయం అవసరం లేదు. అంతలా ఈ బడా హీరో దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగంలో విశేషమైన సేవలు చేస్తూ.. తనదైన చిత్రాలతో అలరిస్తున్నారు. అయితే, దాదాపు ఐదేళ్లుగా తలైవా విజయాన్ని మాత్రం అందుకోలేదు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే ఆయన 'జైలర్' అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీ మాత్రం అదిరిపోయే స్పందనను అందుకుంటూ దూసుకుపోతోంది. ఫలితంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మరి 'జైలర్' మూవీ 18 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!
జైలర్‌గా రజినీకాంత్ ఊచకోత:తలైవా రజినీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన యాక్షన్ మూవీనే 'జైలర్'. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో రమ్యకృష్ణ, మిర్నా మీనన్, వినాయకన్, వసంత్ రవి ప్రధాన పాత్రలను చేయగా.. తమన్నా, సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబులు కీలక పాత్రల్లో కనిపించారు. దీనికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఇచ్చాడు.

జైలర్ మూవీకి బిజినెస్ ఇలా:యాక్షన్ జోనర్‌లో వచ్చిన 'జైలర్' మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా హక్కులకు వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తమిళనాడులో రూ. 62 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు, కర్నాటకలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో రూ. 122.50 కోట్లు బిజినెస్ జరిగింది.
18వ రోజు తెలుగులో వసూళ్లు:'జైలర్' మూవీ 18వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీగా రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 58 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. రూ. 1.11 కోట్లు షేర్, రూ. 2.05 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

18 రోజులకు కలిపి ఎంతంటే:18 రోజుల్లో 'జైలర్' ఏపీ, తెలంగాణలో భారీ స్పందన అందుకుంది. ఫలితంగా నైజాంలో రూ. 21.43 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.91 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.76 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.06 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.74 కోట్లు, గుంటూరులో రూ. 3.05 కోట్లు, కృష్ణాలో రూ. 2.70 కోట్లు, నెల్లూరులో రూ. 1.35 కోట్లతో.. రూ. 45.00 కోట్లు షేర్, రూ. 76.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

తెలుగులో ఎన్ని కోట్ల లాభం:క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'జైలర్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తద్వారా ఈ చిత్రం రూ. 13 కోట్లు మేర బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, ఈ మూవీ 18 రోజుల్లోనే రూ. 45.00 కోట్లు రాబట్టింది. ఫలితంగా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 32.00 కోట్లు లాభాలను అందుకుని సరికొత్త రికార్డును నమోదు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు:'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. దీంతో 18 రోజుల్లో తెలుగులో రూ. 77.65 కోట్లు (తమిళ వెర్షన్ కలిపి), తమిళంలో రూ. 171.90 కోట్లు, కర్నాటకలో రూ. 66.15 కోట్లు, కేరళలో రూ. 51.45 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 15.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 188.60 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 571.00 కోట్లు గ్రాస్, రూ. 279.05 కోట్లు షేర్ వచ్చింది.

ఓవరాల్‌గా లాభం ఎంతంటే:సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన 'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 122.50 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. దీంతో ఇది రూ. 124 కోట్లు షేర్ టార్గెట్‌తో ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చింది. ఇక, ఈ చిత్రం 18 రోజుల్లో రూ. 279.05 కోట్లు రాబట్టింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 155.05 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











