Jailer 2 Days Collections: రెండో రోజూ ఊచకోత.. తెలుగులో భోళా ఉన్నా భారీగానే.. అప్పుడే అన్ని కోట్లా!

సుదీర్ఘ కాలంగా ఇండియన్ సినిమా రంగంలో తనదైన ముద్రను వేసుకుంటూ.. విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో సందడి చేస్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఏజ్‌తో సంబంధం లేకుండా ఏడాదికి కనీసం ఒక్క సినిమానైనా చేసే ఆయన.. చాలా కాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు.

ఈ పరిస్థితుల్లో ఇప్పుడు 'జైలర్' అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చేశారు. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో లభించాయి. రెండో రోజూ అదే ఊపు కనిపించింది. మరి 'జైలర్' రెండు రోజుల వసూళ్లపై మీరే లుక్కేయండి!

Rajinikanth Starrer Jailer Movie 2 Days Worldwide Official Collections

జైలర్‌గా రజినీకాంత్ అరాచకం: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రమే 'జైలర్'. నెల్సన్ దిలీప్ కుమార్ తీసిన ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేయగా.. తమన్నా హీరోయిన్‌గా నటించింది. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని ఇచ్చాడు. ఇందులో సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబు కీలక పాత్రలు చేశారు.

Rajinikanth Starrer Jailer Movie 2 Days Worldwide Official Collections

జైలర్ మూవీకి బిజినెస్ ఇలా: 'జైలర్' మూవీపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తమిళనాడులో రూ. 62 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు, కర్నాటకలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో రూ. 122.50 కోట్లు బిజినెస్ అయింది.

Rajinikanth Starrer Jailer Movie 2 Days Worldwide Official Collections

2వ రోజు తెలుగులో వసూళ్లు: 'జైలర్' మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2వ రోజూ హోల్డ్ చేసుకుంది. ఫలితంగా నైజాంలో రూ. 1.18 కోట్లు, సీడెడ్‌లో రూ. 36 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 36 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 22 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, గుంటూరులో రూ. 17 లక్షలు, కృష్ణాలో రూ. 18 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో.. రూ. 2.65 కోట్లు షేర్, రూ. 4.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

Rajinikanth Starrer Jailer Movie 2 Days Worldwide Official Collections

2 రోజులకు కలిపి ఎంతంటే: 'జైలర్' మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల్లో సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 4.39 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.30 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.17 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 62 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 43 లక్షలు, గుంటూరులో రూ. 82 లక్షలు, కృష్ణాలో రూ. 63 లక్షలు, నెల్లూరులో రూ. 30 లక్షలతో.. రూ. 9.66 కోట్లు షేర్, రూ. 16.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

Rajinikanth Starrer Jailer Movie 2 Days Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు: 'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. దీంతో 2 రోజుల్లో తెలుగులో రూ. 17.25 కోట్లు (తమిళ వెర్షన్ కలిపి), తమిళంలో రూ. 39.30 కోట్లు, కర్నాటకలో రూ. 17.05 కోట్లు, కేరళలో రూ. 9.65 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 56.80 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.00 కోట్లు గ్రాస్‌, రూ. 70.85 కోట్లు షేర్ వచ్చింది.

Rajinikanth Starrer Jailer Movie 2 Days Worldwide Official Collections

ఓవరాల్‌గా హిట్ అవ్వాలంటే?: 'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 122.50 కోట్ల బిజినెస్ చేసుకుని రూ. 124 కోట్లు షేర్ టార్గెట్‌తో వచ్చింది. ఇది 2 రోజుల్లో రూ. 70.85 కోట్లు రాబట్టింది. అంటే.. ఇంకా 53.15 కోట్లు వసూలు చేయాలి. అలాగే, తెలుగులో రూ. 12 కోట్లు బిజినెస్.. రూ. 13 కోట్లు టార్గెట్‌తో వచ్చింది. 2 రోజుల్లో ఇది రూ. 9.66 కోట్లు రాబట్టడంతో ఇంకా రూ. 3.34 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X